KORUKANTI CHANDAR | గోదావరిఖని : కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మేడలు వంచాలని, సింగరేణి ప్రవేటికరణకు వ్యతిరేకంగా కార్మికవర్గామంతా పోరాడాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలు తెలిపారు. స్దానిక 2ఇంక్లయున్ వద్ద గురువారం ఎర్ర జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్దను పైవేటిపరం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని, కార్మికలోకమంతా ఒక్కటై పోరాడిల్సిన సమయం వచ్చిందని అన్నారు. ‘పోరాడితే పోయెాది ఎమిలేదు బానిస సంకెళ్లు తప్ప’ అనే నినాదంతో చికాగో వీరుల స్ఫూర్తిగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
సింగరేణి లో కేసీఆర్ అమలు చేసిన జివోలు అమలు పర్చకుండా కార్మికులను ఇబ్బందులు పెడుతున్నరన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 20న జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. చారిత్రాత్మక మేడే స్ఫూర్తితో, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కార్మిక హక్కుల కోసం అడుగడుగునా నిలిచిందని పేర్కొన్నారు. సింగరేణి శ్రామికులకు బోనస్లు, ఉద్యోగ భద్రత, మెరుగైన సౌకర్యాలతో గౌరవించామని గుర్తు చేశారు.
కేసీఆర్ పాలనలో టీఎస్ఆర్టీసీ కార్మికులకు జీత భత్యాల పెంపు, ఆరోగ్య బీమా వంటి సంక్షేమ పథకాలతో భరోసా కల్పించామని ఆటో డ్రైవర్లు, అసంఘటిత కార్మికులకు ఆర్థిక సాయం, సంక్షేమ బోర్డులతో అండగా నిలిచామని చెప్పారు. ఈ కార్యక్రమం లో టబీజీకేఎస్, బీఆర్ఎస్ నాయకులు వడ్డెపల్లి శంకర్, నారాయణదాసు మారుతి, రామరాజు, కొడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.