Centenarian woman ఆగస్టు 7: రుద్రంగి మండలం బడితండా గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు బానోత్ మీరిబాయి(120) బుధవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మీరిబాయికి నలుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు. 120 ఏళ్ల వయసులో కూడా సొంతగా ఆమె తన పనులను చేసుకునేదని, ఇతరుల మీద అధారపడలేదన్నారు.
గత 15 రోజులగా అనారోగ్యం బారిన పడి మీరిబాయి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మీరిబాయికి 105 మంది మనుమళ్లు, మనుమరాళ్లు, మునిమనమలు, మునిమనుమరాళ్లు ఉన్నారు. మీరిబాయి మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్తులందరూ విషాదంలో మునిగిపోయారు. శతాధిక వృద్ధురాలు మరణించడంతో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దేగావత్ తిరుపతి, నాయకులు మధన్, రాందాస్, నరేష్, గజన్లు సంతాపం తెలియజేశారు.