CP Gouse Alam | గన్నేరువరం, జూలై 10 : నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలది కీలక పాత్ర అని సీపీ గౌస్ ఆలం అన్నారు. గన్నేరువరం మండలంలోని పారువెల్ల, ఖాసీంపేట గ్రామాల్లో గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రతీ వీధిలో సీసీ కెమెరాలు ఉండటం వల్ల ప్రజల భద్రతకు భరోసా ఉంటుందన్నారు. జిల్లా వ్యాప్తాంగా 700 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
యువత మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలన్నారు. ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌లకు అలవాటు పడవద్దన్నారు. వాహనదారులు, ప్రయాణికులు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబందనలు పాటించాలన్నారు. అనంతరం వాహనదారులకు హెల్మెట్ లను అందజేసి, పారువెల్ల, ఖాసీంపేట గ్రామాల మధ్యలో నిర్వహిస్తున్న వాలి మ్యాచ్ ను టాస్ వేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ విజయ్ కుమార్, తిమ్మాపూర్ సీఐ రమేష్, ఎస్ఐ నరేందర్ రెడ్డి, పారువెల్ల సర్పంచ్ యల్లా లక్ష్మీ రాంరెడ్డి, ఖాసీంపేట సర్పంచ్ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.