అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్కు గాయమైంది. సోమవారం సాయంత్రం ఆయన భుజానికి గాయమైనట్లు ఎన్టీఆర్ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొన్నది. డాక్టర్ జె. మధుసూదన్ రావు, ఆర్. ఏ. పూర్ణ చంద్ర తేజస్వి నేతృత్వంలోని డాక్టర్ల బృందం ఆయనకు చికిత్సను అందిస్తున్నారని వెల్లడించింది. ఎన్టీఆర్ పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల సమయం పడుతుందని డాక్టర్లు సూచించారని, అభిమానులు ఎవరూ ఆందోళన చెందొద్దని ఆ ప్రకటనలో కోరారు.
ఎన్టీఆర్ ఆరోగ్యం తాలూకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు అధికారికంగా తెలియజేస్తామని ఆయన కార్యాలయం పేర్కొన్నది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.