Boat accident | సముద్రంలో మునిగిపోయిన పడవ.. ఆరుగురు మృతి.. 130 మంది గల్లంతు..!
Boat accident | ఇండోనేషియాలో ఘోర నౌక ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. మరో 130 మంది గల్లంతయ్యారు. మొత్తం 213 మంది ప్రయాణికులు, 30 మంది సిబ్బందితో కలిపి 243 మందితో ప్రయాణిస్తున్న 'వర్గో ట్రాన్స్పోర్ట్ 8' అనే నౌక జావా సముద్రంలో మునిగిపోయింది. ఈ పెను విషాదంలో ఇప్పటివరకు 107 మందిని సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి.
Boat accident : ఇండోనేషియాలో ఘోర నౌక ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. మరో 130 మంది గల్లంతయ్యారు. మొత్తం 213 మంది ప్రయాణికులు, 30 మంది సిబ్బందితో కలిపి 243 మందితో ప్రయాణిస్తున్న ‘వర్గో ట్రాన్స్పోర్ట్ 8’ అనే నౌక జావా సముద్రంలో మునిగిపోయింది. ఈ పెను విషాదంలో ఇప్పటివరకు 107 మందిని సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. మరో ఆరుగురి మృతదేహాలను వెలికితీశాయి. ఇంకో 130 మంది ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. తూర్పు జావాలోని సురబయ నుంచి శనివారం బయలుదేరిన నౌక.. దక్షిణ కాలిమంటన్‌లోని బంజర్మాసిన్కు వెళుతోంది. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కెప్టెన్ నుంచి అధికారులకు చివరి సందేశం అందింది. సముద్రంలో దాదాపు మూడు మీటర్ల ఎత్తున అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయని, దాంతో నౌక ఒకవైపునకు ఒరిగిపోతోందని ఆయన తెలిపారు. ఆ తర్వాత కొద్దిసేపటికే నౌకతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. బంజర్మాసిన్ రేవుకు సుమారు 148 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు నిర్ధారించారు.
సమాచారం అందుకున్న వెంటనే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. నౌకాదళానికి చెందిన నౌకతో సహా నాలుగు నౌకలు, ఒక హెలికాప్టర్, సమీపంలోని టగ్బోట్ల సహాయంతో గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. కాపాడిన వారిని సమీపంలోని తూర్పు జావా పోర్టుకు తరలిస్తున్నారు. మరోవైపు బంజర్‌మాసిన్‌లోని త్రిశక్తి పోర్టు వద్ద గల్లంతైన వారి బంధువులు వందలాదిగా గుమిగూడారు. ప్రయాణికుల జాబితాలను చూస్తూ తమ వారి క్షేమ సమాచారం కోసం తీవ్ర ఆవేదనతో ఎదురుచూస్తున్నారు.
వేలాది ద్వీపాలతో కూడిన ఇండోనేషియాలో రవాణాకు ఫెర్రీలపైనే ఎక్కువగా ఆధారపడతారు. అయితే భద్రతా లోపాల కారణంగా ఇక్కడ తరచూ ఇలాంటి సముద్ర ప్రమాదాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాకుండా అధికారిక రికార్డుల్లో ఉన్న ప్రయాణికుల సంఖ్యకు, వాస్తవంగా నౌకలో ఉన్నవారి సంఖ్యకు తేడా ఉండటం ఇక్కడ సర్వసాధారణమని, దాంతో గల్లంతైన వారి కచ్చితమైన సంఖ్యను నిర్ధారించడం కష్టంగా మారిందని అధికారులు చెబుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ శతకాల మోత.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
Vehicle Emissions | వాహన ఉద్గారాలపై నియంత్రణ ఎందుకు.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

