జగిత్యాల రూరల్, అక్టోబర్ 26: ‘అది చేస్తాం.. ఇది చేస్తాం అని కాంగ్రెస్ దొంగ హామీలు ఇస్తోంది. వాళ్లు ఏదీ చేయరు. ఉన్నవి తొలగిస్తరు. కాంగ్రెస్ అంటేనే కర్షక వ్యతిరేకి. అభివృద్ధి నిరోధకి. రైతన్నకు పంట పెట్టుబడికి ఇచ్చే రైతు బంధు ఆపాలని ఈసీకి ఫిర్యాదు చేస్తరా..? ఇదేం వైఖరి.. రైతులంటే మరీ ఇంత ఓర్వలేని తనమా..? ’ అంటూ జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే ఎం సంజయ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని మోతె రోడ్డులోని బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకుల వైఖరిని ఎండగట్టారు. రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారితే కాంగ్రెస్ నాయకులు చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.
పంట పెట్టుబడి సాయంతో వడ్డీ వ్యాపారులవైపు చూడకుండా రైతు సగర్వంగా వ్యవసాయం చేసుకుంటుంటే జీర్ణించుకోలేకపోతున్నారని, ఇది ఎంత వరకు కరెక్టో చెప్పాలన్నారు. రైతులు, దళితులు, మైనార్టీల ఓట్లతో 60 ఏండ్లు అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్, నేడు రైతు వ్యతిరేక విధానాలు అవలంభించడం సరికాదన్నారు. మొన్నటికి మొన్న అమెరికా పర్యటనలో వ్యవసాయానికి మూడు గంటలు విద్యుత్ ఇస్తే సరిపోతుందని రేవంత్‌రెడ్డి మాట్లాడారని, నేడు ఏకంగా రైతు బంధునే ఆపాలని మరో నాయకుడు ఈసీకి ఫిర్యాదు చేయడా న్ని చూస్తే రైతులపై వారికి ఎంత ప్రేమ ఉందో అర్థమైపోతున్నదన్నారు. ఉచిత విద్యుత్ సరఫరాకు వాళ్లే బ్రాండ్ అంబాసిడర్లమని చెప్పుకునే కాంగ్రెస్, మరి కర్ణాటకలో అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా సాగుకు ఐదు గంటల కరెంట్ కూడా ఇవ్వలేక చేతులెత్తేసిందని దుయ్యబట్టారు.
ఇప్పటికైనా రైతులు గమనించాలని, రైతు బాంధవుడు కేసీఆర్ కావాలా..? ఉన్నయి తీసేసి ఇబ్బందులు పెట్టే కాంగ్రెస్ కావాలా..? ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సీఎం అయిన తర్వాతనే వ్యవసాయం పండుగలా మారిందన్నారు. మిషన్ కాకతీయ కింద చెరువులు, కుంటలకు పూర్వవైభవం తీసుకువచ్చామని, సాగుకు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని, రైతు బంధు, రైతు బీమాతో ఎంతో భరోసా నింపామన్నారు. కాంగ్రెస్, బీజేపీలు అధికారంలోకి వస్తే అంధకారమేనని, వారి పాలిత రాష్ర్టాల్లో రైతు బంధు, దళితబంధు కాదు కదా..? మన మాదిరి ఏ ఓక్క పథకం కూడా అమలు చేయడంలేదని చెప్పారు.
వాళ్లు అధికారంలో ఉన్న రాష్ర్టాల ప్రజలు మన పథకాలు కావాలని డిమాండ్ చేస్తున్నారని, మన పాలనకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని చెప్పారు. ఈ రోజు రైతు బంధును నిలిపివేయాలని అంటున్న వారు, రేపు దళితబంధు, మైనార్టీ బంధు, గొర్రెల పంపిణీ వంటి పథకాలకు సైతం అడ్డంపడుతారని, వారిని నమ్మవద్దని సూచించారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాగానే రైతు బంధు తరహాలోనే సీఎం కేసీఆర్ అమలు చేసే కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి దీ మాగా నిలుస్తుందని చెప్పారు. కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ చైర్మెన్ గోలి శ్రీనివాస్, ప్యా క్స్ చైర్మెన్ జోగినిపెల్లి సందీప్‌రావు, ఏఎంసీ మాజీ చైర్మెన్ దాఓదర్రావు, కౌన్సిలర్లు తోట మల్లిఖార్జు న్, కూతురు రాజేష్, ముస్కు నారాయణరెడ్డి, సర్పంచ్ చెరుకు జాన్, సీనియర్ నాయకులు ము స్కు ఎల్లారెడ్డి, దావ సురేష్, ఆనందరావు, శ్రీ రా మ్ బిక్షపతి, అంజయ్య గౌడ్. కో ఆప్షన్ సభ్యులు శ్రీనివాస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.