Rakhi festival | చిగురుమామిడి, ఆగస్టు 9: రక్షబంధన్ పర్వ దినం పురస్కరించుకొని మండలంలో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు.వచ్చిన బస్సులలో ప్రయాణికులు కిక్కిరిసి ఉండడంతో మరో బస్సు కోసం ప్రయాణికులు వేచి ఉండాల్సి వస్తుంది. ప్రతి బస్సులో ప్రయాణికులు అధిక సంఖ్యలో తరలి వెళ్లడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హుస్నాబాద్ నుండి కరీంనగర్, హుస్నాబాద్ నుండి హుజురాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులలో ప్రయాణికులు సీట్లు లేక నిల్చుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుందరగిరి, చిగురుమామిడి, ముల్కనూర్, బస్టాప్ ల వద్ద ప్రయాణికుల రద్దీ ఎక్కువగా కనిపించింది. ప్రయాణికులకు అనుకూలంగా బస్సులను సమకూర్చాల్సిన అధికారులు విఫలమయ్యారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.