కరీంనగర్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్ జిల్లాలో శ్రీవారి ఆలయ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ టీటీడీని కోరారు. ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణానికి బీఆర్ఎస్ హయాంలో కరీంనగర్లో 10 ఎకరాల స్థలం కేటాయించినట్టు గుర్తుచేశారు.
స్థలం కేటాయించి రెండేండ్లయినా పనులు ప్రారంభం కాలేదని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణంపై అవసరమైతే ఏపీ సీఎం చంద్రబాబును కలుస్తానని తెలిపారు.