వకార్పొరేషన్/ గంగాధర/ సైదాపూర్, అక్టోబర్ 30: విద్యుత్ చార్జీల పెంపును అడ్డుకోవడంలో బీఆర్ఎస్ విజయం సాధించడంపై జిల్లాలో పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకొన్నారు. నగరంలో స్థానిక తెలంగాణ చౌక్‌లో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కటౌట్‌కు బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలపై అడ్డగోలుగా విద్యుత్ చార్జీలు పెంచాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని సరైన పద్ధతిలో శాస్త్రీయంగా ఈఆర్సీ ముందు ఉంచడంలో బీఆర్ఎస్ విజయం సాధించిందన్నారు. ప్రజలపై భారీ విద్యుత్ భారాన్ని మోపకుండా ప్రభుత్వాన్ని నియంత్రించిన తీరు గొప్పదన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జంగిలి సాగర్, దిండిగాల మహేశ్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నిం అనిల్ గౌడ్, నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు షౌకత్, బొంకూరి మోహన్ తదితరులు పాల్గొన్నారు. గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన మాజీ ఎమ్మెల్యే రవిశంకర్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కటౌట్‌కు పాలాభిషేకం చేశారు.
అనంతరం మాట్లాడుతూ, విద్యుత్ చార్జీలు పెంపునకు ప్రయత్నం చేసిన ప్రభుత్వం, కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నాయకుల పోరాటంతో వెనక్కు తగ్గిందన్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ విజయమని కొనియాడారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, నాయకులు సాగి మహిపాల్‌రావు, కంకణాల విజేందర్‌రెడ్డి, వేముల దామోదర్, మడ్లపెల్లి గంగాధర్, రామిడి సురేందర్, ఎండీ నజీర్, వడ్లూరి ఆదిమల్లు, జోగు లక్ష్మీరాజం, సుంకె అనిల్, లింగాల దుర్గయ్య, సముద్రాల అజయ్, గంగాధర వేణు తదితరులు పాల్గొన్నారు. సైదాపూర్ మండలకేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రజల పక్షాన నిలబడి చేసిన పోరాటం వల్లే ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపును విరమించుకుందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సోమారపు రాజయ్య, మాజీ ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి, వెన్నంపల్లి సింగిల్‌విండో చైర్మన్ బిల్ల వెంకటరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్‌రెడ్డి, నాయకులు ఎల్కపల్లి రవీందర్, బత్తుల లక్ష్మీనారాయణ, వర్నె మోహన్‌రావు, శ్రీనివాస్, కొమురయ్య, శ్రీనివాస్, మహేశ్, తిరుపతి, ఐలయ్య, అనిల్, యాదగిరి, జితేందర్‌రెడ్డి, రాజయ్య, ఆనంద్, రవీందర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.