రాజన్న సిరిసిల్ల, జూన్ 2(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ సోమవారం సిరిసిల్లలో పర్యటించనున్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సిరిసిల్ల పట్టణంలో నిర్వహించే కార్యక్రమాలకు హాజరవుతారు.
ఉదయం 10 గంటలకు నేతన్న చౌక్‌లోని అమర వీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం 10.30 గంటలకు రగుడు చౌరస్తాలోని తెలంగాణ భవన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. 11 గంటలకు కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు.