తిమ్మాపూర్, అక్టోబర్ 31 : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్దేనని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి పార్టీ అభ్యర్థి మాగంటి సునీతను ఆశీర్వదించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మానకొండూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి శుక్రవారం జూబ్లీహిల్స్‌లో ఇంటింటా ఓట్లు అభ్యర్థించారు.
గడపగడపకూ తిరుగుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. హైదరాబాద్ మహానగరం గత పదేండ్లలో ఎలా ఉన్నదో.. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో ఎలా ఉన్నదో ప్రజలే గమనించాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తప్పకుండా గెలుస్తుందని చెప్పారు. ఆయన వెంట నాయకులు రావుల రమేశ్, సిద్ధం వేణు, గంప వెంకన్న, శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.