Vodithela Satish Kumar | చిగురుమామిడి, జూన్ 23 : పార్టీ కోసం కృషిచేసి వివిధ కారణాలతో మృతి చెందిన కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ అన్నారు. చిగురుమామిడి మండలంలోని సుందరగిరి గ్రామంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు బత్తిని సత్తయ్య గౌడ్, పత్తేము పద్మ, నవాబ్ పేటలో బీఆర్ఎస్ నాయకులు దేవసాని శ్రీనివాస్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి గణపతి రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా, వారి కుటుంబాలను మంగళవారం పరామర్శించారు.
మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, పార్టీని నమ్ముకున్న వారందరికి వెన్నంటే ఉండి అండగా ఉంటుందన్నారు. వారు పార్టీకి చేసిన సేవలను కొనియాడారు. వీరి వెంట బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, సింగిల్ విండో చైర్మన్ జంగ రమణారెడ్డి, సుందరగిరి సర్పంచ్ జంగ శిరీష, బఆర్ఎస్ నాయకులు కొమ్ము కొమురయ్య, ఎస్కే సిరాజ్, అనుమాండ్ల సత్యనారాయణ, కూతురు శరభందరెడ్డి, ఎండీ సర్వర్ పాషా, తాళ్లపల్లి సంపత్, మక్బూల్ పాషా, కాషవేణి నర్సయ్య, దొనపాటి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.