local bodies | ధర్మారం, జూలై 28: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు సత్తా చాటే విధంగా అందరూ సమైక్యంగా కృషి చేయాలని నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి పిలుపునిచ్చారు. మాజీ మంత్రి నేత కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి, నర్సింహులపల్లి గ్రామాలలో సోమవారం పార్టీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలకు భారీ స్పందన లభించగా ఆయా గ్రామాల్లో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, శ్రేణులు తరలివచ్చారు.
మొదట దొంగతుర్తి గ్రామానికి మండల శాఖ పార్టీ ముఖ్య నాయకులు హాజరుకాగా గ్రామ కూడలిలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామ శాఖ అధ్యక్షుడు బాలసాని లింగయ్య గులాబీ జెండాను ఎగరవేశారు. అదేవిధంగా నర్సింహులపల్లి గ్రామంలో ప్రధాన కూడలిలో గ్రామ శాఖ అధ్యక్షుడు గాండ్ల నర్సయ్య పార్టీ జెండాను ఆవిష్కరించారు. జెండాల ఆవిష్కరణ అనంతరం ఆయా గ్రామాలలో నిర్వహించిన పార్టీ ప్రత్యేక సమావేశాలకు ముఖ్యఅతిథిగా హాజరైన ప్యాక్స్ చైర్మన్ బలరాం రెడ్డి మాట్లాడి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బలరాం రెడ్డి మాట్లాడుతూ త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి పూర్వ వైభవం వచ్చే విధంగా అందరూ సమిష్టిగా కృషి చేయాలని అన్నారు.
గ్రామ శాఖలో ఏవైనా విభేదాలు ఉంటే వాటిని పక్కన పెట్టి రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల ప్రకారం అందరూ స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఏకదాటిపై నిలబడి పార్టీ నిర్ణయించిన అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. అంతర్గత విభేదాలు బహిర్గతం కాకుండా అంతర్గతంగా పరిష్కరించడానికి మండల నాయకత్వం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. పార్టీలో అంకితభావంతో పనిచేసిన వారికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల్లో పలుకుబడి ఉన్న వారిని గుర్తించి టికెట్ ఇస్తుందని ఆయన వివరించారు. పార్టీ నిర్ణయించిన అభ్యర్థి గెలుపు కోసం అందరూ సమిష్టిగా కృషి చేస్తే గ్రామ గ్రామాన గులాబీ జెండా రెపరెపలాడుతుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 19 నెలలు గడిచినప్పటికీ వాగ్దానాలను నెరవేర్చలేదని విషయాన్ని ప్రజలకు పార్టీ శ్రేణులు వివరించాలని ఆయన సూచించారు.
ఇప్పటికే ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆసక్తి సన్నగిల్లి వ్యతిరేకత ఏర్పడిందని ఆయన అన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపే పరమావధిగా అందరూ కృషి చేయాలని బలరాంరెడ్డి కోరారు. పార్టీ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ మాట్లాడుతూ గ్రామ శాఖలో చిన్న చిన్న విభేదాలు ఉంటే వాటిని పక్కనపెట్టి స్థానిక సంస్థల ఎన్నికల బలోపేతానికి కృషి చేయాలని ఆయన కోరారు. పార్టీలో అంకితభావంతో పనిచేసిన వారందరికీ తగిన గుర్తింపు ఉంటుందని విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని ఆయన పేర్కొన్నారు.
ఈ ప్రత్యేక సమావేశాలకు ఆయా గ్రామాల పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బాలసాని లింగయ్య, గాండ్ల నర్సయ్య అధ్యక్షత వహించగా నంది మేడారం ప్యాక్స్ వైస్ చైర్మన్ సామంతుల రాజ మల్లయ్య, డైరెక్టర్లు సాయిరి కుమార్, దీటీ శ్రీనివాస్,నర్సింహులపల్లి మాజీ సర్పంచ్ ఆడువాల అరుణ జ్యోతి, ఏఎంసీ మాజీ చైర్మన్లు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, గుర్రం మోహన్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ చొప్పరి చంద్రయ్య,దొంగతుర్తి మాజీ ఎంపీటీసీ సభ్యుడు దాడి సదయ్య, మాజీ ఉపసర్పంచి ముత్యాల చంద్రశేఖర్,పార్టీ సీనియర్ నాయకులు పూస్కురు రామారావు కాంపల్లి చంద్రశేఖర్, తుమ్మల రాంబాబు, ఎండి రఫీ, మిట్ట తిరుపతి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శులు కూరపాటి శ్రీనివాస్ ,దొనికెని తిరుపతి పార్టీ సోషల్ మీడియా మండల అధ్యక్షుడు దేవి నలినీకాంత్ ,ఆవుల శ్రీనివాస్, ఆవుల వేణు, అయిత వెంకటస్వామి, పాక వెంకటేశం, మంద శ్రీనివాస్, సంధినేని కొమరయ్య ,రెడపాక శ్రీనివాస్,సాన రాజేందర్, అడువాల రవి, లచ్చయ్య, కాల్వ రమేష్ బాలసాని తిరుపతి , బండి సురేష్, పెర్క బానేష్, అల్వాల సంతోష్, మోర కొమరయ్య , ముదాం శ్రావణ్ కుమార్ ఆవుల లత, కాంపల్లి అపర్ణ ,మార్క సంధ్య , విజయ ,అడువాల సరక్క,ముక్కెర లావణ్య, భూపెల్లి శ్రీనివాస్, సంకరి రాజయ్య, బాలసాని తిరుపతి, వేల్పుల జోగయ్య, గంధం నారాయణ, రాగుల చిన్న మల్లేశం, బండి శ్రీకాంత్, చిందం మల్లేశం, చింతల తిరుపతి, తాళ్ల రాజయ్య,సంకరి చిన్న ఓదెలు, తమ్మడవేని గంగ రాజు తదితరులు పాల్గొన్నారు.