Heart Attack | వీర్నపల్లి , అక్టోబర్ 18 : వీర్నపల్లి మండలంలోని గర్జనపల్లికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గజ్జెల ఆనందం (42) గుండెపోటుతో మృతిచెందాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆనందం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హుటాహుటిన ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యానికి కరీంనగర్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు సమాచారం. మృతదేహం కాసేపటి కిందటే గ్రామానికి చేరుకొగా, కుటుంబ సభ్యులు గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. మృతదేహానికి వివిధ పార్టీకి చెందిన నాయకులు నివాళులర్పించారు.