‘ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన 420హామీలు అమలు చేసేవిధంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి ప్రసాదించు మహాత్మా..’ అంటూ గురువారం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మహాత్మాగాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు. మోసపూరిత వాగ్ధానాలు చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. అనంతరం మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని బాపూజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
హుజూరాబాద్ టౌన్, జనవరి 30: పట్టణంలోని జమ్మికుంట రోడ్డులో గల మహాత్ముడి విగ్రహానికి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధికాశ్రీనివాస్ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు అపరాజ ముత్యంరాజు, ప్రతాప్ తిరుమల్ రెడ్డి, తాళ్లపెల్లి శ్రీనివాస్, ముక రమేశ్, రమాదేవి, సుశీల, కుమార్, ఉమామహేశ్వర్, ప్రతాప మంజుల కృష్ణ, నాయకులు చింత శ్రీనివాస్, ఇమ్రాన్, పంజాల శ్రీధర్, మోరె మధు, రమేశ్, లింగం, దిల్ శ్రీను, ఎర్ర శ్రీధర్ పాల్గొన్నారు.
సైదాపూర్, జనవరి 30: సైదాపూర్ మండలం కేంద్రంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సోమారపు రాజయ్య, సింగిల్ విండో చైర్మన్ బిల్లా వెంకట్‌రెడ్డి, నాయకులు, అబ్బిడి రవీందర్, ఓదెలు, మోహన్, రవీందర్, కొమురయ్య, స్వామి, శ్రీనివాస్, రమేశ్, సురేశ్, తదితరులున్నారు.
వీణవంక, జనవరి 30: కొండపాక గ్రామంలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో గురువారం కాంగ్రెస్ అసమర్థ పాలనపై గాంధీజీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి అప్పని హరీశ్వర్మ, మాజీ సర్పంచ్ ఆవాల అరుంధతి-గిరిబాబు, గ్రామాధ్యక్షుడు భూమయ్య, నాయకులు కాసర్ల సుధాకర్, మ్యాడగోని శ్రీనివాస్, గట్టు మధు, మొగిలి, రాజు, వొల్లాల శ్రీకాంత్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
మానకొండూర్ రూరల్, జనవరి 30: ముంజంపల్లి గ్రామంలో మహాత్మాగాంధీ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు నందగిరి మల్లయ్యాచారి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించి నిరసన తెలిపారు. కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులకు మంచి బుద్ధిని ప్రసాదించాలని గాంధీజీని వేడుకున్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రామంచ గోపాల్ రెడ్డి, కాసం బ్రహ్మారెడ్డి, ఎల్పుగొండ లింగయ్య, బాలెంకి మల్లేశం, డాక్టర్ శ్రీనివాస్, బండ విజేందర్ రెడ్డి, బత్తిని సాగర్ గౌడ్, రెడ్డి సంపత్ రెడ్డి, గుర్రం కిరణ్ గౌడ్, రాచకట్ల వెంకట స్వామి, ఇస్కుల్ల ఆంజనేయులు, కొత్త వెంకట రెడ్డి, జలపతి రెడ్డి, పింది సందీప్, లక్ష్మణ్, కొత్త వెంకట రెడ్డి, మల్లయ్య, రుద్రారం శ్రీనివాస్, బొడ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
తిమ్మాపూర్, జనవరి 30: బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మహాత్మానగర్‌లోని గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి, నిరసన వ్యక్తం చేశారు. మండలాధ్యక్షుడు రావుల రమేశ్, రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ ఉల్లెంగుల పద్మ, నాయకులు పాశం అశోక్‌రెడ్డి, మడుపు శ్రీనివాస్‌రెడ్డి, పొన్నాల సంపత్, మాతంగి లక్ష్మణ్, బొర్ర రవీందర్, అడిచెర్ల సత్యం, కొండ్ర రాజు తదితరులు పాల్గొన్నారు.
శంకరపట్నం, జనవరి 30: మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట మహిపాల్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీకి బీఆర్ఎస్ నాయకులు వినతి పత్రం సమర్పించి నిరసన తెలిపారు.
చిగురుమామిడి, జనవరి 30: మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఇక్కడ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి, వైస్ చైర్మన్ కరివేద మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు రామోజు కృష్ణమాచారి, మాజీ సర్పంచ్‌లు సన్నీల వెంకటేశం, బెజ్జంకి లక్ష్మణ్, కానుగంటి భూమిరెడ్డి, బోయిని శ్రీనివాస్, ముప్పిడి నరసింహారెడ్డి, నాయకులు ఆకవరం శివప్రసాద్, కొత్త కైలాసం, పెసరి రాజేశం, దుడ్డేల లక్ష్మీనారాయణ, ఎండీ సర్వర్ పాషా, నాగిల్లి రాజిరెడ్డి, బుర్ర తిరుపతి, శ్యామకూర సంపత్ రెడ్డి పాల్గొన్నారు.
రామడుగు, జనవరి30: గోపాల్రావుపేట బస్టాండ్ కూడలిలోని గాంధీ విగ్రహానికి స్థానిక ఏఎంసీ మాజీ చైర్పర్సన్ పూడూరి మణెమ్మ వినతిపత్రం సమర్పించగా, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పూడూరి మల్లేశం, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు రేణికుంట అశోక్, బీఆర్ఎస్ నాయకులు మల్లేశం, బుధారపు కార్తీక్, దాసరి శంకర్, సీపెల్లి మధు, బాపురాజు, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
చొప్పదండి, జనవరి 30: పట్టణంలోని గాంధీజీ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, ఆర్నకొండ సింగిల్ విండో చైర్మన్ మినీపాల తిరుపతిరావు, పార్టీ మండల అధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు లోక రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీపీ చిలక రవి, మాజీ జడ్పీటీసీలు ఇప్పనపల్లి సాంబయ్య, మాచర్ల వినయ్, మారెట్ మాజీ చైర్మన్లు గడ్డం చుకరెడ్డి, చంద్రశేఖర్ గౌడ్, నాయకులు బంధారపు అజయ్ కుమార్ గౌడ్, సిపెళ్లి గంగయ్య, గన్ను శ్రీనివాస్ రెడ్డి, నాగిరెడ్డి, మారం యువరాజ్, కొత్తూరు మహేశ్, కృష్ణ, సిరవేణి శ్రీకాంత్, నరేశ్ రావణ్, పెద్దెల్లి అనిల్, వడ్లూరి భూమయ్య, మాఊరం మహేశ్, రమేశ్, గాండ్ల లక్ష్మణ్, బిసవేణి రాజశేఖర్ పాల్గొన్నారు.