కరీంనగర్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టడంపై పార్టీ నాయకులు ఆగ్రహించారు. ప్రశ్నించే గొంతుకలను కాంగ్రెస్ ప్రభుత్వం అణచివేస్తున్నదని, బీఆర్ఎస్ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నదని ధ్వజమెత్తారు. శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు ప్రెస్మీట్లు పెట్టి మరీ కేటీఆర్‌పై కేసును ఖండించారు. ఈ-కార్ రేసుతో హైదరాబాద్‌కు ప్రపంచంలోనే ఉత్తమ బ్రాండ్ ఇమేజ్ను తెచ్చిన ఘనత కేటీఆర్‌కే దక్కుతుందని ప్రశంసించారు. ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రిగా ఆయన ప్రపంచంలోనే గుర్తింపు పొందిన నాయకుడని కొనియాడారు. అలాంటి నాయకుడు ఇప్పడు ప్రజాసమస్యలు, అక్రమాలపై నిలదీస్తుంటే కాంగ్రెస్ తట్టుకోలేకపోతున్నదని విమర్శించారు. ఆయనను నేరుగా ఎదుర్కోలేకే ఇలా కుట్రపూరితంగా కేసులు పెడుతున్నదని మండిపడ్డారు.
గోదావరిఖని, డిసెంబర్ 20: బీఆర్ఎస్ను, మాజీ మంత్రి కేటీఆర్‌ను బద్నాం చేసేందుకు రేవంత్‌రెడ్డి సర్కార్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శించారు. ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే అరెస్టులు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటైందన్నారు. ఎన్ని కేసులు పెట్టినా.. ఎన్ని అబద్ధాలు ప్రచారాలు చేసినా బెదిరేదిలేదన్నారు. కేటీఆర్‌పై అక్రమ కేసులు ఎత్తివేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన 420హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం గోదావరిఖని టీబీజీకేఎస్ కార్యాలయ ఆవరణలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో చందర్ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టిందన్నారు. ఆ కేసులను ఎత్తివేసే దాకా బీఆర్ఎస్ పార్టీ స్థానికంగా చెపట్టిన రిలే దీక్షలు కొనసాగుతాయన్నారు. ఇక్కడ కార్పొరేటర్లు గాదం విజయ, బాదె అంజలి, జనగామ కవిత సరోజని, నాయకులు మూల విజయారెడ్డి, గోపు ఐలయ్యయాదవ్, నారాయణదాసు మారుతి, అచ్చె వేణు, బొగ్గు రవీందర్, మేతుకు దేవరాజ్, వేణు, శ్రావణ్, తోకల రమేశ్, నూతి తిరుపతి, సింహాచలం, రత్నాకర్, చెలకలపల్లి శ్రీనివాస్, జక్కుల తిరుపతి, నీరటి శ్రీనివాస్,. కృష్ణస్వామి, శ్రావణ్, రామరాజు, తదితరులు ఉన్నారు.
ధర్మపురి, డిసెంబర్20: ఫార్ములా ఈ-కార్ రేసుతో తెలంగాణ రాష్ర్టానికి, హైదరాబాద్ నగరానికి ప్రపంచవ్యాప్త గు ర్తింపు లభించిందని కరీంనగర్ డీసీఎమ్మెస్ చైర్మన్ డా ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి పే ర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ మంత్రి కేటీఆర్‌పై అక్రమ కేసులు బనాయిస్తున్నదని విమర్శించారు. శుక్రవారం ఆయన జగిత్యాల జిల్లా ధర్మపురిలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఫార్ములా-ఈ కార్రేసుతో హైదరాబాద్ ఇమేజ్ను పెం చిన మాజీ మంత్రి కేటీఆర్‌పై రేవంత్ స ర్కార్ అక్రమ కేసులు నమోదు చేయించి కక్షసాధింపు చర్యలకు దిగిందని విమర్శించారు. ఎన్ని కేసులు పెట్టినా.. ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా బీఆర్ఎస్ బెదరదన్నారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కశ్మీర్లో, తమిళనాడు సీఎం స్టాలిన్ చైన్నెలో కూడా ఫార్ములా రేస్ నిర్వహించారని చెప్పారు. ఈ రేసులు కేవలం పె ట్టుబడులను ఆకర్శించడానికే మాత్రమే అని విషయం గమనించాలని సూచించా రు. ఫార్ములా-ఈ రేసు కోసం అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేర కు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న హెచ్ఎమ్డీఏ సంస్థ రెండు దఫాలుగా 55కోట్లు కంపెనీకి చెల్లించిందన్నారు. ఆ కంపెనీకి మూడో దఫా కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బు లు చెల్లించలేక రేసును రద్దు చేసిందన్నారు. కార్ రేసులోపై అసెంబ్లీలో చర్చ కు బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నా.. కాం గ్రెస్ ఎందుకు స్పందించడం లేదని ప్ర శ్నించారు.
ప్రస్తుతం గురుకులాల్లో విద్యార్థుల అవస్థలపై చర్చ జరిగితే దానికి డైవర్షన్ చేయడానికి మరో అంశం ముం దుకు తేస్తారని విమర్శించారు. అలాగే ఆరు గ్యారెంటీలను అమలు చేసే పరిస్థితి లేకపోవడంతో బీఆర్ఎస్పై ఆరోపణలు చేస్తున్నదన్నారు. ఏడాది పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు మొ దలైందన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు రాజేశ్, మున్సిపల్ కౌన్సిలర్లు అయ్యోరి వేణు, యూనుస్, అశోక్, కార్తీక్, ఏఎంసీ మాజీ చైర్మన్ అయ్యోరి రాజేశ్‌కుమార్ నాయకులు వొడ్నాల మల్లేశం, చిలివేరి శ్యామ్‌సుందర్, అనంతుల లక్ష్మణ్, వేముల నరేశ్,విజయ్, సం గి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.