BRS | జగిత్యాల (మల్లాపూర్) : మల్లాపూర్ మండల కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్ అన్నారు. మల్లాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన బుధవారం విలేకర్లతో మాట్లాడారు. మల్లాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం నిర్వహిస్తున్నందున ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ జిల్లా జడ్పీ చైర్మన్ దావ వసంత, ఎమ్మెల్సీ ఎల్ రమణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల సంజయ్ హాజరు అవుతున్నారని తెలిపారు.
అలాగే మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, దేవ మల్లయ్య, టౌన్ అధ్యక్షుడు లింగస్వామి గౌడ్, నాయకులు శరత్ గౌడ్, రామ్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు మేకల సతీష్, ఎదూలపురం శంకర్, కోడూరి భిక్షపతి, గొర్రె హనుమంతు, మాట్ల గంగాధర్, బద్దినపల్లి ప్రేమ్, నల్ల రాజేశ్వర్, లక్పతి, ఉయ్యాల లక్ష్మణ్, బిట్టు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.