బీఆర్ఎస్ ప్రచారానికి అద్భుత స్పందన
నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తున్నదని, నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ సారి పార్టీ గెలుపుకోసం ఎన్నికల్లో కష్టపడి పని చేయాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ సూచించారు.
- పార్టీ శ్రేణులు కష్టపడి పని చేయాలి
- కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి
- వారికి ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు
- బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్
కార్పొరేషన్, ఏప్రిల్ 26: నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తున్నదని, నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ సారి పార్టీ గెలుపుకోసం ఎన్నికల్లో కష్టపడి పని చేయాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ సూచించారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే నివాసంలో కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ, ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై డమ్మీ అభ్యర్థిని నిలబెట్టి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఐదేళ్లలో ఎంపీ బండి సంజయ్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఐతు కొత్తలు కూడా తీసుకురాలేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీకి ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ, కరీంనగర్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే వినోద్‌కుమార్‌ను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి కార్యకర్త బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకుపోయి ఈ సారి ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో పార్టీ గెలుపునకు కృషి చేయాలని సూచించారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నాయకులు శ్యాంసుందర్‌రెడ్డి, పిల్లా శ్రీనివాస్, లక్ష్మయ్య, మధు, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

