గీత కార్మికులను ఆదుకోవాలి
తంగళ్లపల్లి మండలం తాడూరులో ప్రమాదవశాత్తు తాటి వనం దగ్ధమై ఉపాధి కోల్పోయిన గీతకార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు.
- కాలిన చెట్లను సంరక్షించే మార్గాలను అన్వేషించాలి
- కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్
- తాడూరులో దగ్ధమైన తాటి వనం పరిశీలన
సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 21: తంగళ్లపల్లి మండలం తాడూరులో ప్రమాదవశాత్తు తాటి వనం దగ్ధమై ఉపాధి కోల్పోయిన గీతకార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన తాడూరులో కాలిపోయిన తాటిచెట్లను పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే హార్టికల్చర్ యూనివర్సిటీ వీసీ నీరజతో ఫోన్లో మాట్లాడి, సమస్యను వివరించారు. కాలిన చెట్లను సంరక్షించే మార్గాలను అన్వేషించాలని కోరారు. కాలిన చెట్లు వానకాలంలో చిగురించకుంటే.. తాను బీహార్‌లోని పాట్నా నుంచి పొట్టి తాటి విత్తనాలను తెప్పించి పార్లమెంట్ పరిధిలోని గీత కార్మికులకు పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు.
ఇప్పుడు నర్సరీల్లో పొట్టి తాటి మొక్కలు దొరికితే కాలిన తాటిచెట్ల ప్రదేశంలో నాటిస్తానని తెలిపారు. గీత కార్మికులకు తక్షణ సాయం అందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతిని ఫోన్ ద్వారా కోరారు. కాగా, తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పలువురు గీతకార్మికులు వినోద్‌కు వినతిపత్రం అందించారు. ఆయన వెంట జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఎంపీపీ పడిగెల మానస, పీఏసీఎస్ చైర్మన్ బండి దేవదాస్‌గౌడ్, వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, నాయకులు మాట్ల మధు, పడిగెల రాజు, సురభి నవీన్‌రావు, ములిగే దుర్గాప్రసాద్, బాల్‌రెడ్డి, కందుకూరి రామాగౌడ్ ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

