supply of urea | సారంగాపూర్, ఆగస్టు 25: రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సారంగాపూర్ మండల కేంద్రంలో సోమవారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ మండలంలోని సారంగాపూర్, కోనాపూర్ సొసైటీలు, ఆగ్రోస్ ద్వారా రైతులు పండించిన పంటలకు అనుగుణంగా రైతులకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.
మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై నాయకులు రాస్తారోకో నిర్వహించడంతో రోడ్డుపై ఇరువైపులా వాహనాలు ఆగిపోయాయి. విషయం తెలుసుని ఎస్ ఐ గీత పోలీస్ సిబ్బందితో చేరుకొని ధర్నా, రాస్తారోకో చేస్తున్న నాయకులతో మాట్లాడి రోడ్డుపైనుంచి లేపించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తేలు రాజు, ప్రధాన కార్యదర్శి అనంతుల గంగారెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ సాగి సత్యం రావు, నాయకులు బైరి మల్లేష్ యాదవ్, గుర్రం స్వామి, ఎండబెట్ల ప్రసాద్, సాంబారి గంగాధర్, సాతల్ల రమేష్, తిరుపతి, గంగాధర్, శ్రీను, ప్రభాకర్, రమేష్, గంగరాజం, ప్రేమ్ కుమార్, చిరంజీవి, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.