BRS leaders | సుల్తానాబాద్ రూరల్, డిసెంబర్ 07: సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్ గ్రామానికి చెందిని బీఆర్ఎస్ అనుబంధ యువజన విభాగం మండల అధ్యక్షుడు గుడుగుల సతీష్ తల్లి లక్ష్మి ఇటీవల మృతి చెందింది. కాగా బీఆర్ఎస్ నాయకులు ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మృతికి గల కారణాలను సతీష్ ని అడిగి తెలుసుకున్నారు.
పరామర్శించిన వారిలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ బోయిని రాజమల్లయ్య, నాయకులు పసేడ్ల సంపత్, గుడుగుల కనుకయ్య, గుడుగుల నంద్దయ్య, గుడుగుల రాజయ్య, వెంకన్న, నర్సయ్య, రాజయ్య, కిషన్‌తోపాటు తదితరులు ఉన్నారు.