చిగురుమామిడి, సెప్టెంబర్ 02 : కాళేశ్వరం ప్రాజెక్టు పై అసత్య ఆరోపణలు చేస్తూ కేసును సిబిఐకి అప్పగించడాన్ని నిరసిస్తూ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ రోల్ మోడల్‌గా తీర్చిదిద్దిన కేసీఆర్ పై అక్కసుతో రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ లేనిపోని అబాండాలు మోపి కేసును సిబిఐకి అప్పగించిందన్నారు.
ప్రాజెక్టు ద్వారా వేలాది మంది రైతులకు, ప్రజలకు మేలు జరిగిందన్నారు. బీటలు వారిన భూములలో సస్యశ్యామలం చేస్తే కాంగ్రెస్ ఓర్వలేకపోతుందని విమర్శించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, ఆర్బిఎస్ మండల మాజీ అధ్యక్షుడు పెనుకుల తిరుపతి, జిల్లా నాయకుడు సాంబారీ కొమురయ్య, ఉపాధ్యక్షుడు పెసరి రాజేశం, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు ఎండీ సర్వర్ పాషా, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు తాటికొండ సందీప్ రెడ్డి, ప్రచార కార్యదర్శి బెజ్జంకి రాంబాబు, కొమ్మెర మహేందర్ రెడ్డి, కొమ్మెర భూపతిరెడ్డి, కృష్ణమాచారి, వంతడుపుల దిలీప్, అనుమాండ్ల సత్యనారాయణ, బెజ్జంకి లక్ష్మణ్, మహంకాళి కొమురయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు గిట్ల తిరుపతిరెడ్డి, నాగేల్లి రాజిరెడ్డి, యాళ్ల జనార్దన్ రెడ్డి, బుర్ర తిరుపతి, సన్నిల మల్లేశం, గునుకుల మహేందర్ రెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.