వేములవాడ టౌన్, అక్టోబర్ 15 : వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా రాతి కట్టడాలే నిర్మించాలని బీఆర్ఎస్ పట్టణ నాయకులు సూచించారు. సిమెం ట్ కాంక్రీటు కట్టడాలుంటే ఆలయ చరిత్రతోపాటు భక్తుల మనోభావాలకు భంగం కలుగుతుందని చెప్పారు. బుధవారం రాజన్న ఆల య అభివృధ్ధి పనులను పరిశీలించడానికి వే ములవాడకు వచ్చిన దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడా రు. యాదాద్రి తరహాలోనే రాజన్న క్షేత్రంలో కృష్ణ శిలలు, నల్లరాతి కట్టడాలు వాడాలని, ఈ విధంగా కట్టడాలు నిర్మిస్తే వచ్చే భక్తులకు ఆలయంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుందని, భక్తిభావం పెంపొందుతుందని తెలిపారు.
60 నుంచి 70 పిల్లర్లు సిమెంట్, కాంక్రీటుతో కూడిన కట్టడాలు నిర్మిస్తామని ఇటీవల విప్ ఆది శ్రీనివాస్ అన్నారని, దీనివల్ల ఆలయ ప్రాశస్త్యం, చరిత్ర దెబ్బ తినడమే కాకుండా భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వారవుతారని చెప్పారు. ఆలయంలో మాత్రం రాతి కట్టడా లు నిర్మించాలని బీర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్, సిరిగిరి చందు, గోలి మహేశ్, తదితరులు పాల్గొన్నారు.