Kalvasrirampur | కాల్వ శ్రీరాంపూర్, ఫిబ్రవరి 1 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడం పట్ల కాల్వ శ్రీరాంపూర్ లో బీఆర్ఎస్ నాయకులు ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కుట్రలో భాగంగానే కేసీఆర్ కు నోటీసులు జారీ చేశారని మండిపడ్డారు.
నోటీసుల పేరుతో బీఆర్ఎస్ ను ఇబ్బందులు పెట్టాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కారుకు రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నూనెటి సంపత్, మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి, సర్పంచులు మంథని రాజయ్య, అడిగోప్పల రాణి, తీగల నాగరాజు, గరిడే లక్ష్మీ అశోక్, బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు నూనెటి కుమార్, మాజీ సర్పంచులు, నాయకులు నిదానపురం దేవయ్య, బైరం రమేష్, సిరికొండ కొమురయ్య, జూకంటి అనిల్, కొల్లూరి రాయమల్లు, ఇబ్రహీం, గొడుగు మల్లయ్య, ఆకుల స్వామి, తాత సాయి, కుంభం రాజు, వడ్నాల శ్రీనివాస్, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.