
Chigurumamidi | చిగురుమామిడి, సెప్టెంబర్ 8 : కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు ఇచ్చిన హామీలు అమలుపై ప్రభుత్వంను ప్రశ్నించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు మామిడి అంజయ్య, మండల నాయకులు కత్తుల రమేష్, సన్నీల వెంకటేశం, ఎస్కే సిరాజ్, బోయిని శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ లో మంగళవారం నిర్వహించే ధర్నాకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న వారిని ఎస్సై జగదీశ్వర్ ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తుందని మండిపడ్డారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని భయంతోనే బీఆర్ఎస్ నాయకులను నిర్బంధించడం ముందస్తుగా అరెస్టులు చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. ఆ వైఫల్యాలను ప్రజలకు తెలియజేసేందుకు పోలీస్ వ్యవస్థను ఉపయోగించి ప్రతిపక్ష పార్టీల గొంతుకలను అచివేస్తున్నారని అన్నారు. అరెస్టు చేసి ఉద్యమాలను ఆపలేరని ప్రజల గొంతులు నొక్కలేరని వారు స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు, ముందస్తు అరెస్టులు, పోలీసులు నిర్బంధాలు కొనసాగితే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీఆర్ఎస్ మరింత పోరాటం చేస్తుందని హెచ్చరించారు.
హుస్నాబాద్ ధర్నాకు తరలిన బీఆర్ఎస్ నాయకులు
హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ పిలుపుమేరకు ధర్నాకు చిగురుమామిడి మండలం నుండి భారీగా తరలి వెళ్లారు. పలు గ్రామాల నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. తరలిన వారిలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు సాంబారి కొమురయ్య, మాజీ ఎంపీపీ కొత్త వినిత శ్రీనివాస్ రెడ్డి, ముల్కనూర్ సర్పంచ్ సాంబారి భారతమ్మ కొమురయ్య, మాజీ ఎంపిటిసి లు పెసరి జమున, మామిడి రాజేశ్వరి, మండల నాయకులు రామోజు కృష్ణమాచారి, పెసరి రాజేశం, ఎండి సర్వర్ పాషా, అనుమాండ్ల సత్యనారాయణ, బుర్ర తిరుపతి, కూతురు శరభంద రెడ్డి, కాశబోయిన విజయలక్ష్మి, రాజు వివిధ గ్రామాలకు చెందిన బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.