licensed Surveyors | కాంగ్రెస్ సర్కార్ పాలనలో ఓ వైపు ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు ఆందోళన చేస్తుంటే.. మరోవైపు ఉద్యోగులు తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ రోడ్డెక్కుతున్నారని తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు రేవంత్ సర్కార్ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన బాట పడుతున్నారు. తాజాగా ఈ జాబితాలో లైసెన్స్డ్ సర్వేయర్లు కూడా చేరిపోయారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చాలని లైసెన్స్డ్ సర్వేయర్లు అసెంబ్లీని ముట్టడించారు. ఈ క్రమంలో లైసెన్స్డ్ సర్వేయర్లను అరెస్ట్ చేసిన పోలీసులు పోలీస్ స్టేషన్లకు తరలించారు. పోలీసులు లైసెన్స్డ్ సర్వేయర్లను వెంబడించి.. పరుగెత్తించి మరీ అరెస్ట్ చేయడం వీడియలో చూడొచ్చు.
తమ డిమాండ్లు నెరవేర్చాలని అసెంబ్లీని ముట్టడించిన లైసెన్స్డ్ సర్వేయర్లు
లైసెన్స్డ్ సర్వేయర్లను అరెస్ట్ చేసిన పోలీసులు pic.twitter.com/bX4mqYUqLJ
— Telugu Scribe (@TeluguScribe) September 8, 2026