Suriya | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్, భారీ ఫాలోయింగ్ ఉన్న సూర్య.. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తన సినిమాల పరిధిని మరింత పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలో సూర్యకు జోడీగా మమితా బైజు నటించారు. ఆగస్టులో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా కథలోని భావోద్వేగ అంశాలు, కుటుంబ అనుబంధాలను దర్శకుడు తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లు టాక్ వచ్చింది.
‘విశ్వనాథ్ అండ్ సన్స్’ థియేట్రికల్ రన్ దాదాపుగా పూర్తవుతున్న నేపథ్యంలో.. ఇప్పుడు డిజిటల్ రిలీజ్‌పై అధికారికంగా క్లారిటీ వచ్చింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ 11 నుంచి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో థియేటర్లలో సినిమాను మిస్ అయిన ప్రేక్షకులతో పాటు మరోసారి కుటుంబ సమేతంగా ఈ ఎమోషనల్ డ్రామాను చూడాలనుకునే వారికి ఓటీటీ ద్వారా అవకాశం లభించనుంది. ఓటీటీ రిలీజ్ విషయంలోనూ మేకర్స్ ప్రత్యేకంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా కేవలం ఒరిజినల్ తమిళ భాషలో మాత్రమే కాకుండా పలు డబ్బింగ్ వెర్షన్లలోనూ అందుబాటులోకి రానుంది.
తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ను ప్రేక్షకులు వీక్షించవచ్చు. దీంతో ఈ సినిమా రీచ్ మరింత విస్తరించే అవకాశం ఉంది. ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు కూడా సినిమా అందుబాటులోకి రానుండటంతో.. సూర్య అభిమానులతో పాటు వెంకీ అట్లూరి సినిమాలను ఇష్టపడే ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది.‘విశ్వనాథ్ అండ్ సన్స్’లో సూర్య, మమితా బైజు జోడీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు ప్రాధాన్యత ఇచ్చిన కథలో వీరి పాత్రలు కథనానికి అనుగుణంగా సాగుతాయని తెలుస్తోంది.ముఖ్యంగా సూర్య తన స్టార్ ఇమేజ్‌కు భిన్నంగా ఎమోషనల్ టచ్ ఉన్న పాత్రలో కనిపించడం సినిమాకు ప్రత్యేకతగా నిలిచిందనే టాక్ వినిపించింది. మరోవైపు మమితా బైజు కూడా తన పాత్రకు తగినట్లుగా నటించి ఆకట్టుకున్నట్లు ప్రేక్షకుల నుంచి స్పందన వచ్చింది.