Dharmaram | ధర్మారం, ఏప్రిల్11 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో శనివారం సంఘ సంస్కర్త, విద్యావేత్త, రచయిత మహాత్మా జ్యోతిబా ఫూలే కు బీఆర్ఎస్ నాయకులు నివాళులర్పించారు. బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు తుమ్మల రాంబాబు ఆధ్వర్యంలో పూలే జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి వారు నివాళి అర్పించారు. పూలే వెనుకబడిన వర్గాల చేసిన కృషిని ఈ సందర్భంగా వారు కొనియాడారు.
దేశానికి స్ఫూర్తిదాయకమైన జీవితం మహాత్మా జ్యోతిబా పూలేదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు గుర్రం మోహన్ రెడ్డి, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ధర్మారం, నంది మేడారం గ్రామ శాఖ అధ్యక్షులు తుమ్మల రాంబాబు, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కూరపాటి శ్రీనివాస్, నంది మేడారం, గోపాల్ రావు పేట నర్సింగాపూర్ గ్రామ శాఖ పార్టీ అధ్యక్షుడు సామంతుల రాజమల్లయ్య, పంజాల శ్రీనివాస్, గొడుగు మల్లయ్య, పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి దేవి నళిని కాంత్, సీనియర్ నాయకులు ఐత వెంకటస్వామి, ఆవుల శ్రీనివాస్, నాడెం శ్రీనివాస్, దేవి అజయ్ కుమార్, దేవి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.