హుజూరాబాద్‌టౌన్/ రూరల్/ జమ్మికుంట/వీణవంక/ గంగాధర/ గన్నేరువరం/ శంకరపట్నం/ కరీంనగర్ రూరల్/ మానకొండూర్, మే 3: జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో శుక్రవారం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌కు మద్దతుగా పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ముమ్మర ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓటు అభ్యర్థించారు.
హుజూరాబాద్ పట్టణంలో పలు వార్డుల్లో జరిగిన ప్రచార కార్యక్రమాల్లో బీఆర్ఎస్వై నియోజకవర్గ కార్యదర్శి కొలిపాక అజయ్, 7వ వార్డులో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, నవీన్, నాయకులు రామగిరి కృష్ణ, అందె రాజయ్య, చారి, అంబాల కన్నయ్య, మొలుగూరి తిరుపతి, మహేశ్, గాలిపెల్లి సాయిచరణ్, మడెడ్ల నితీశ్, 5వ వార్డులో కౌన్సిలర్ అపరాజ ముత్యంరాజు, 23వ వార్డులో కౌన్సిలర్ మొలుగు సృజనాపూర్ణచందర్, 27వ వార్డులో కౌన్సిలర్ తాళ్లపెల్లి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. హుజూరాబాద్ మండలం సిర్సపల్లి గ్రామంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు.
ఇక్కడ హుజూరాబాద్ సింగిల్ విండో చైర్మన్ ఎడవెల్లి కొండల్ రెడ్డి, మారెట్ కమిటీ మాజీ చైర్మన్ పోల్సాని రామారావు, ఎంపీటీసీ మన్యాల రాధమ్మ, నాయకులు వెంకట్రావు, జనగం రాజు, లింగారెడ్డి, రవీందర్ రావు, నవీన్ ఉన్నారు. జమ్మికుంట పట్టణంలోని 4, 5, 7, 8, 9, 16, 17, 22, 24, 25, 27, 30 వార్డుల్లో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు టంగుటూరు రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించగా, ఆయా వార్డుల అధ్యక్షులు, కౌన్సిలర్లు, నాయకులు మంద రాజేశ్, ముద్రగడ నవీన్, వీరన్న, మధుసూదన్‌రెడ్డి, రాజేశ్, ఎండీ సలీమ్, మల్లికార్జున్, రమేశ్, ఫీస, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.
వీణవంక మండలంలోని పలు గ్రామాల్లో ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ వనమాల-సాధవరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాలకిషన్‌రావు, ఆయా గ్రామాల మాజీ సర్పంచులు పర్లపెల్లి రమేశ్, నర్సయ్య, మోరె సారయ్య, ముత్తయ్య, కోమల్‌రెడ్డి, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు ముమ్మరంగా ప్రచారం చేశారు. గంగాధర మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో ఆయా గ్రామాల తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామాధ్యక్షుడు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గన్నేరువరం మండలం పారువెల్ల, మాదాపూర్, గుండ్లపల్లి గ్రామాల్లో ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఆంజనేయులు, రైతుబంధు జిల్లా మాజీ అధ్యక్షుడు గుడెల్లి తిరుపతి, చింతల రవి, పంబాలి ఎల్లయ్య, లక్ష్మణ్, సంతోష్, కనకయ్య, రాజయ్య, వడల నరేందర్ రెడ్డి ముమ్మరంగా ప్రచారం చేశారు. శంకరపట్నం మండలం చింతలపల్లి, తాడికల్, కరీంపేట్, ధర్మారం, తదితర గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు పెద్ది శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్, సర్పంచుల ఫోరం మాజీ చైర్మన్ పల్లె సంజీవరెడ్డి, గద్దపాక మాజీ సర్పంచులు గోపు విజయ్‌కుమార్‌రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.
కరీంనగర్ మండలం ఫకీర్‌పేట, చామనపల్లి గ్రామాల్లో ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. ఫకీర్‌పేటలో మాజీ సర్పంచ్ కటకం నందు, మొగ్దుంపూర్లో ఎంపీటీసీ దామరపల్లి పుష్పా అంజిరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ కందుల రమేశ్ గౌడ్, మాజీ సర్పంచ్ జక్కుం నర్సయ్య పాల్గొన్నారు. చెర్లభూత్కూర్‌లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెండ్యాల శ్యాంసుందర్‌రెడ్డి, గ్రామాధ్యక్షుడు కూర శ్యాంసుందర్ రెడ్డి, ఎంపీటీసీ బుర్ర తిరుపతి గౌడ్, మాజీ సర్పంచ్ దబ్బెట రమణారెడ్డి ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి ప్రచారం నిర్వహించారు.
నగునూర్‌లో పోలింగ్ బూత్‌ల వారీగా కార్యకర్తలు ఎన్నికల ప్రచారం చేశారు. మాజీ సర్పంచ్ ఉప్పుల శ్రీధర్, సాయిల వినయ్‌కుమార్, మాజీ ఎంపీటీసీ వరి భద్రయ్య ప్రచారం నిర్వహించారు. దుర్శేడ్‌లో మాజీ ఉపసర్పంచ్ సుంకిశాల సంపత్‌రావు, రాజ్‌కమల్, కుమార్, శ్రీరామోజ్ తిరుపతి, నేరెళ్ల శ్రీనివాస్, మహేశ్ ప్రచారంలో పాల్గొన్నారు. మానకొండూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గడ్డం నాగరాజు, నియోజకవర్గ కన్వీనర్ గుర్రం కిరణ్‌గౌడ్, నాయకులు దండబోయిన శేఖర్, కొత్తకొండ నాగరాజు, పిట్టల మధు, గంజి శ్రీనివాస్, పిండి సందీప్ తదితరులు ప్రచారం నిర్వహించారు.