రాష్ట్ర రాజధానిలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ గూండా గిరికి నిరసనగా, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి మద్దతుగా జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు సన్నద్ధమైన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు శుక్రవారం ఉదయాన్నే అరెస్ట్ చేశారు. వాకింగ్ చేస్తుంటే కొందరిని, ఇండ్లల్లో కాలకృత్యాలు తీర్చుకుంటుండగా మరికొందరిని, హైదరాబాద్‌కు వెళ్లడానికి సిద్ధంగా ఉన్న వారిని నిర్ధాక్షిణ్యంగా అరెస్ట్ చేసి తమ వాహనాల్లో పోలీస్స్టేషన్లకు తరలించారు. ముఖ్య నేతలను గృహ నిర్బంధంలో ఉంచారు. సాయంత్రం సొంత పూచీకత్తుపై విడిచి పెట్టారు.
కార్పొరేషన్/ హుజూరాబాద్/ గంగాధర/ గన్నేరువరం/ ఇల్లందకుంట/ వీణవంక/ కొత్తపల్లి/ చిగురుమామిడి/ రామడుగు/ మానకొండూర్/ కరీంనగర్ రూరల్/ జమ్మికుంట/ చొప్పదండి, సెప్టెంబర్ 13: నగరంలోని పలువురు బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌తో పాటు నాయకులు చేతి చంద్రశేఖర్, మెరుగు శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారితోపాటు కార్పొరేటర్ డిండిగాల మహేశ్, నాయకులు గందె మహేశ్, గుగ్గిళ్ల శ్రీనివాస్, కొండపల్లి సతీశ్, సాయికృష్ణ తదితరులను రెండో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. హుజూరాబాద్‌లో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, సింగిల్‌విండో చైర్మన్ ఎడవెళ్లి కొండల్‌రెడ్డి, పార్టీ మండల, టౌన్ అధ్యక్షులు సంగెం అయిలయ్య, కొలిపాక శ్రీనివాస్, నాయకులు చొల్లేటి కిషన్‌రెడ్డి, ఇరుమళ్ల సురేందర్‌రెడ్డి, తాళ్లపల్లి శ్రీనివాస్, ఇమ్రాన్, గూడూరి ప్రతాప్‌రెడ్డి, గనిశెట్టి ఉమామహేశ్వర్, పోరెడ్డి దయాకర్‌రెడ్డి, కంకణాల వేణుగోపాల్‌రెడ్డి, రావుల రాజలింగారెడ్డి, సమ్మయ్య, ఆరెపల్లి ఎల్లయ్య, కొయ్యడ కమలాకర్, పంజాల సదానందం, మైకెల్, మనోహర్, కానుగంటి శ్రీనివాస్ తదితరులను అరెస్ట్ చేశారు. మధ్యాహ్నం రెండు గంటలకు సొంతపూచీకత్తుపై పోలీసులు వదిలిపెట్టారు. గంగాధర మండలం బూరుగుపల్లిలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఇంటిని పోలీసులు ఉదయం 4 గంటలకే చుట్టుముట్టి ఆయనను హౌస్ అరెస్టు చేశారు. అలాగే బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్‌రావు, నాయకులు వేముల దామోదర్, వేముల అంజి, ఎండీ నజీర్, మడ్లపెల్లి గంగాధర్, గంగాధర మోహన్, గంగాధర నగేశ్, కల్లెపెల్లి నరేశ్, గుడిసె తిరుపతి తదితరులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
గన్నేరువరంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు గంప వెంకన్న, ఎంపీటీసీల ఫోరం మాజీ మండలాధ్యక్షుడు గుడెల్లి ఆంజనేయులు, నాయకులు తీగల మోహన్ రెడ్డి, న్యాత సుధాకర్, పుల్లెల లక్ష్మణ్, అటికం శ్రీనివాస్, గొల్లపల్లి రవి, మీసాల ప్రభాకర్, నగేశ్, బోయిన అంజయ్య తదితరులను అరెస్ట్ చేశారు. ఇల్లందకుంటలో మాజీ ప్రజాప్రతినిధులు పుట్ట రాజు, వెంకటస్వామి, యూత్ హుజూరాబాద్ నియోజకవర్గ కోఆర్డినేటర్ జవ్వాజి కుమారస్వామి, బీఆర్ఎస్వీ నియోజకవర్గ ఇన్చార్జి అలేటి శ్రీరామ్, బీఆర్ఎస్ నాయకులు రాకేశ్, అనిల్, కౌశిక్, అశోక్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీణవంక మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామా ల బీఆర్ఎస్ మాజీ సర్పంచులు నీల కుమారస్వామి, పోతుల నర్సయ్య, బండారి ముత్తయ్య, అడిగొప్పుల సత్యనారాయణ, కొత్తిరెడ్డి కాంతారెడ్డి, వీణవంక మాజీ ఉపసర్పంచ్ వోరెం భానుచందర్, నాయకులు పొదిల రమేశ్, జున్నూతుల మల్లారెడ్డి, వోరెం మధు, వోరెం క్రాంతి, మల్లెత్తుల సదయ్య, తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కొత్తపల్లి మండలం చింతకుంటలో మాజీ వైస్ ఎంపీపీ భూక్యా తిరుపతినాయక్, కార్పొరేటర్లు జంగిల్ సాగర్, కృష్ణ గౌడ్, ఎదుల రాజశేఖర్, నాయకులు సయ్యద్ చాంద్ పాషా, ఫిరోజ్, ఎల్లయ్య, అజయ్, కనకయ్య, శ్రీనివాస్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. చిగురుమామిడిలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసంపై దాడిచేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య ఆధ్వర్యంలో అంబేదర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, మండల నాయకులు సన్నిల్ల వెంకటేశం, ఆకవరం శివప్రసాద్, బోయిని శ్రీనివాస్, బుర్ర తిరుపతి, మహంకాళి కొమురయ్య, యాళ్ల జనార్దన్ రెడ్డి, కల్వల సంపత్ రెడ్డి, పోతనవేణి శ్రీనివాస్ ఉన్నారు.
రామడుగులో పోలీసులు అరెస్టు చేసిన వారిలో గోపాల్రావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మామిడి తిరుపతి, బీసీసెల్ మండలాధ్యక్షుడు ఎడవెల్లి మల్లేశం, చాడ శేఖర్‌రెడ్డి, గుండి ప్రవీణ్, పెసరి రాజమౌళి, లంక మల్లేశం, తదితరులు ఉన్నారు. కాగా, కాంగ్రెస్ నాయకులు రౌడీల్లా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని బీఆర్ఎస్ పార్టీ ఎస్సీసెల్ మండలాధ్యక్షుడు శనగిరపు అర్జున్ పేర్కొన్నారు. మానకొండూర్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం మండలాధ్యక్షుడు రాయికంటి కిరణ్, లలితాపూర్ మాజీ సర్పంచ్, నాయకులు, మాదవరం సంజీవరావు, మర్రి కొండయ్య, గడ్డి రాజుయాదవ్, మాశం సాగర్, బొయిని వెంకటేశ్ తదితరులు ఉన్నారు. కరీంనగర్ మండలానికి చెందిన నాయకులు బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు పెండ్యాల శ్యాంసుందర్‌రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు వెళ్లేందుకు సిద్ధం కాగా, పోలీసులు అరెస్ట్ చేసి రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చెర్లభూత్కూర్ మాజీ సర్పంచ్ దబ్బెట రమణారెడ్డి, మాజీ ఎంపీటీసీ బుర్ర తిరుపతి గౌడ్, నాయకులు సుంకిశాల సంపత్‌రావు, ఊరడి మల్లారెడ్డి, శ్రీకాంత్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. జమ్మికుంట పట్టణం, మండలంలో సహకార సంఘం అధ్యక్షుడు పొనగంటి సంపత్, కౌన్సిలర్లు గాజుల భాస్కర్, పాతకాల రమేశ్, దయ్యాల శ్రీనివాస్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు టంగుటూరి రాజ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చొప్పదండిలో మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, మాజీ వైస్ చైర్మన్ కొత్త గంగారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్‌రెడ్డి, కౌన్సిలర్ మాడూరి శ్రీనివాస్, నాయకులు నలుమాచు రామకృష్ణ, మాచర్ల వినయ్‌కుమార్, గాండ్ల లక్ష్మణ్, మారం యువరాజ్, అజ్జు, అనిల్, నరేశ్రావన్, మహేశ్, నితీశ్‌ను ఎస్ఐ అనూష అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
వీణవంక, సెప్టెంబర్ 13: చల్లూరు గ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ దిష్టిబొమ్మలను బీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. హైదరాబాద్‌లో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఆయన అనుచరుల దాడికి నిరసనగా చల్లూరు బస్టాండ్ ఆవరణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జక్కు నారాయణ, మాజీ ఎంపీటీసీ మల్లయ్య, నాయకులు రామిడి సంపత్‌రెడ్డి, దండి తిరుపతి, నగేశ్, జీవన్, సది, సంపత్‌రెడ్డి, సుభాష్‌రెడ్డి, ఈదునూరి అనిల్, మధుసూదన్‌రెడ్డి, ఆవునూరి జీవన్, ఎలకపెల్లి నగేశ్, బైరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఫసియొద్దీన్, చెన్నమనేని నాగరాజు, అజాం, అరుణ్, రాహుల్, అనిల్, అభిలాష్ పాల్గొన్నారు.