BRS Formation Day | కాల్వశ్రీరాంపూర్, ఏప్రిల్ 27 : కాల్వశ్రీరాంపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను ఆపార్టీ నాయకులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఎగరవేసి, నినాదాలు చేశారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది సాధించినట్లు గుర్తు చేశారు. రాబోవు రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నూనేటి సంపత్, మాజీ జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, సర్పంచులు గరిడె అశోక్, మంథని రాజయ్య, నాయకులు ఆడెపు రాజు, భైరం రమేశ్, నిదానపురం దేవయ్య, దండి అజయ్‌కుమార్, కర్ణాకర్‌రావు, కొట్టె సంపత్, పులి సాగర్‌రెడ్డి, మాదాసి రాంచంద్రం, సారంగపాణి, కుంభం రాజు, రహీం, పైడయ్య, సురేశ్, గొర్ల సంతోష్, తొట్ల శ్రీనివాస్, కొట్టె సమ్మయ్య, కొల్లూరి రాజమల్లు, కొట్టె రవీందర్, తమ్మిశెట్టి నాగభూషణం, మేడుదుల రాజుకుమార్, ఎల్కపెల్లి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.