Compensation | చిగురుమామిడి, మే 5: అకాల వర్షం, ఎదురుగాలులకు నేలరాలిన మామిడి తోటల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని ముదిమాణిక్యం, గాగిరెడ్డిపల్లి, గురుకుల పల్లె తదితర గ్రామాల్లో నేలరాలిన మామిడి తోటలను, వరి ధాన్యాన్ని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య తో కలిసి సోమవారం పరిశీలించారు.
రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో మామిడికాయలు నేలరాలాయని, పెద్ద ఎత్తున నష్టం సంభవించిందని రైతులు వారు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని గ్రామాల్లో కురిసిన గాలి, వర్ష బీభత్సానికి వర్షానికి స్తంభాలు విరిగాయని, ఇల్లు పరీక్షంగా దెబ్బతిన్నాయని అన్నారు. ముదిమాణిక్యంలో జక్కుల రవి, జక్కుల మహేష్ లకు చెందిన పది ఎకరాల మామిడి తోట కాయలు పూర్తిగా నేల రాలాయని అన్నారు.
పలు గ్రామాల్లో రైతులు మామిడి తోటలు కాయలు రాలి ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు. ప్రభుత్వం వారికి ఎకరానికి 50 వేల రూపాయల పరిహారం చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జక్కుల రవీందర్, సన్నీల వెంకటేశం, మల్లికార్జున్ రెడ్డి, నరసింహారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు బోయిని రమేష్, కలవల సంపత్ రెడ్డి, చెప్యాల నారాయణరెడ్డి, బండి అంజిరెడ్డి, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.