HomeKarimnagarBoinapally Vinod Kumar Stated That Art And Craft Courses Help To Bring Out The Hidden Creativity In Students
విద్యార్థి దశలోనే క్రాఫ్ట్ కోర్సులు నేర్పించాలి
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కోర్సులు దోహదపడతాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్
కరీంనగర్లో రాష్ట్రస్థాయి టెక్నికల్ టీచర్స్ శిక్షణ, ప్రదర్శన ప్రారంభం
కమాన్‌చౌరస్తా, జూన్ 11: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కోర్సులు దోహదపడతాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. చిన్నతనంలోనే మ్యూజిక్, పెయింటింగ్, కార్పెంటరీ, ఎంబ్రాయిడరీ టైలరింగ్, టీవీ మొబైల్ రిపేర్ వంటి క్రాఫ్ట్ కోర్సులు నేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. గతంలో పలు స్కూళ్లలో క్రాఫ్ట్ కోర్సులు ఉన్నా శిక్షణ ఇచ్చేవారు లేక నిర్వీర్యమయ్యాయని పేర్కొన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం క్రాఫ్ట్ కోర్సుల నిర్వహణకు ప్రాధాన్యమిస్తున్నదన్నారు. అన్ని సబ్జెక్టులతో సమానంగా క్రాఫ్ట్, ఆర్ట్, డ్రాయింగ్, మ్యూజిక్ కోర్సుల్లో శిక్షణకు ఏర్పాట్లు చేసింద న్నారు.
ఆదివారం కరీంనగర్లో రాష్ట్రస్థాయి టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ కం శిక్షణ ప్రదర్శనను ప్రారంభించి మాట్లాడా రు. శిక్షణార్థులు గీసిన బొమ్మలు ఎంతో చక్కగా ఉన్నాయని, సాంసృతిక వైభవాన్ని చారిత్రాత్మకతను చాటి చెబుతున్నాయని చెప్పారు. వీటిని చిత్రీకరించిన విద్యార్థులను అభినందించారు. ఈ ప్రదర్శనలో వ్యర్థాల నుంచి కూడా విలువైన కళాత్మక వస్తువులను రూపొందించడం గొప్ప విషయమన్నారు. డ్రాయింగ్, టైలరింగ్, మ్యూజిక్కు సంబంధించిన ఉపాధ్యాయ పోస్టుల మంజూరు కోసం సీఎంతో మాట్లాడి ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్య మానవుని ప్రాథమిక హకు అని, ప్రతి ఒక్కరూ వినియోగించుకుని ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కరీంనగర్ డీఈవో జనార్దన్, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణీ హరిశంకర్, కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్, అసిస్టెంట్ కమిషనర్ ఫర్ ఎగ్జామినేషన్స్ నారాయణస్వామి, కోర్స్ కోఆర్డినేటర్ కోట లక్ష్మిరెడ్డి పాల్గొన్నారు.