కాషాయ నేతల బరితెగింపు
బీజేపీ నాయకులు బరి తెగించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న గులాబీ శ్రేణుల వద్దకు చేరుకొని కయ్యానికి కాలుదువ్వారు. వారిపైకి దూసుకొచ్చి దాడికి యత్నించారు. అయినా బీఆర్ఎస్ (టీఆర్ఎస్) నేతలు సంయమనం పాటిస్తూ ఆందోళన కొనసాగించారు
- సిరిసిల్ల, మానకొండూర్‌లో గులాబీ శ్రేణులను రెచ్చగొట్టే యత్నం
- దాడికి యత్నం.. వారించిన పోలీసులతో దురుసు ప్రవర్తన
- అయినా టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకుల సంయమనం
- శాంతియుతంగా నిరసన
సిరిసిల్ల టౌన్/ మానకొండూర్ అక్టోబర్ 27: బీజేపీ నాయకులు బరి తెగించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న గులాబీ శ్రేణుల వద్దకు చేరుకొని కయ్యానికి కాలుదువ్వారు. వారిపైకి దూసుకొచ్చి దాడికి యత్నించారు. అయినా బీఆర్ఎస్ (టీఆర్ఎస్) నేతలు సంయమనం పాటిస్తూ ఆందోళన కొనసాగించారు. ఎమ్మెల్యేల కొనుగోలు చేసిన కుట్రలను నిరసిస్తూ గురువారం రాజన్నసిరిసిల్ల జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు.
ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా బీజేపీ పట్టణశాఖ అధ్యక్షుడు అన్నల్దాస్ వేణు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు అడ్డుకొనేందుకు యత్నించారు. పోలీసులు అక్కడికి చేరుకొని వారించి వెనక్కు పంపించారు. అలాగే కరీంనగర్ జిల్లా మానకొండూర్‌లో ఆందోళన చేస్తున్న టీఆర్ఎస్ నేతలపైకి కాషాయపార్టీ నేతలు దూసుకువచ్చారు. ప్రజాస్వామిక పద్ధతిలో నిరసన తెలుపుతున్న వారిపై దాడికి యత్నించారు. వారించేందుకు వచ్చిన పోలీసులతోనూ దురుసుగా ప్రవర్తించారు. అక్కడే బైఠాయించి రెచ్చగొట్టేలా నినాదాలు చేశారు. మరోసారి పోలీసులు జోక్యం చేసుకోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

