సిరిసిల్లలో బీజేపీ దౌర్జన్యం
బీఆర్ఎస్ శ్రేణులపై బీజేపీ నాయకులు గూండాగిరి చేశారు. బాలికకు న్యాయం చేయాలని, సంజయ్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్లలో శాంతియుతంగా నిరసన చేస్తుండగా, దౌర్జన్యం చేశారు. దీంతో నేతన్న చౌరస్తాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు రంగంలోకి దిగి కమలం నాయకులను అదుపులోకి తీసుకున్నారు..
- శాంతియుత నిరసన చేస్తున్న శ్రేణులపై గూండాగిరి
- దీటుగా బదులిచ్చిన గులాబీ దండు
- సిరిసిల్ల నేతన్న చౌరస్తాలో తీవ్ర ఉద్రిక్తత
- స్వయంగా రంగంలోకి దిగిన ఎస్పీ
- కమలం నేతల అరెస్ట్.. ఠాణాకు తరలింపు
రాజన్న సిరిసిల్ల, మే 18(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ శ్రేణులపై బీజేపీ నాయకులు గూండాగిరి చేశారు. బాలికకు న్యాయం చేయాలని, సంజయ్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్లలో శాంతియుతంగా నిరసన చేస్తుండగా, దౌర్జన్యం చేశారు. దీంతో నేతన్న చౌరస్తాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు రంగంలోకి దిగి కమలం నాయకులను అదుపులోకి తీసుకున్నారు.. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు శాంతియుత నిరసనకు సిద్ధమయ్యారు. పోలీసుల అనుమతితో అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేసేందుకు రెడీ అయ్యారు. ఇది జీర్ణించుకోలేని బీజేపీ నాయకులు దౌర్జన్యం చేశారు.
ఆగమేఘాల మీద అదే చౌరస్తాలో ధర్నా చేస్తామని పట్టుబట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. బీజేపీ నాయకులు గాంధీ చౌరస్తాలో, బీఆర్ఎస్ నాయకులు నేతన్న చౌరస్తాలో చేసుకోవాలని సూచించారు. అయినా బీజేపీ నాయకులు వినకుండా నేతన్న చౌరస్తాలో ధర్నా చేస్తున్న గులాబీ శ్రేణుల మీదకు దూసుకొచ్చారు. రెచ్చగొట్టేలా కవ్వింపు చర్యలకు దిగారు. పోటీగా నినాదాలు చేస్తూ దాడి చేశారు. అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ శ్రేణుల దాడిలో బీఆర్ఎస్ కార్యకర్తలు లక్కిరెడ్డి కమాలాకర్‌రెడ్డి, కంచర్ల రవిగౌడ్ గాయపడ్డారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా, ఎస్పీ మహేశ్ బీ గీతే రంగంలోకి దిగారు. బీజేపీ శ్రేణులను అదుపులోకి తీసుకొని, వాహనాల్లో పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేశారు. బీఆర్ఎస్ శ్రేణులను ఎస్పీతోపాటు డీఎస్పీ నాగేంద్రాచారి సముదాయించి అక్కడి నుంచి పంపించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతల తీరుపై ఎస్పీ సీరియస్ అయ్యారు. కాగా, బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించి వేశారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ భవన్‌కు చేరుకొని విలేకరుల సమావేశం నిర్వహించారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడూరి ప్రవీణ్, జడ్పీ మాజీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ బీజేపీ దాడిని తీవ్రంగా ఖండించారు. తర్వాత తెలంగాణ భవన్ ఎదుట మొదటి బైపాస్ రోడ్డుపై సంజయ్ రాజీనామా చేయాలంటూ వంద అడుగుల భారీ ఫ్లెక్సీతో బైఠాయించి ధర్నా చేశారు. బాలికకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని భారీ ఫ్లెక్సీని లాక్కున్నారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. ఆందోళన చేస్తున్న నాయకులను అదుపులోకి తీసుకొని తంగళ్లపల్లి ఠాణాకు తరలించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | ఎన్టీఆర్ అభిమానుల తీరుపై సజ్జనార్ అసంతృప్తి.. నా ఫొటోను మార్ఫింగ్ చేశారు అంటూ ట్వీట్!
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
KU exams | రేపటి కేయూ పరీక్షలు వాయిదా
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

