సాగునీటికి రైతుల ఆందోళన
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిలా మారింది నడిగడ్డ రైతుల పరిస్థితి. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలానికి ఒకవైపు కృష్ణానది, మరోవైపు తుంగభద్ర నది ఉన్నా రైతులకు మాత్రం సాగునీరు అందక తల్లడిలుతున్నారు. గతం లో కురిసిన కొద్దిపాటి వర్షానికి రైతులు మిరప, పత్తి పంటలు సాగు చేశారు.
- కాల్వలో నిల్చొని అన్నదాతల నిరసన
మానవపాడు, ఆగస్ట్టు 9 : అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిలా మారింది నడిగడ్డ రైతుల పరిస్థితి. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలానికి ఒకవైపు కృష్ణానది, మరోవైపు తుంగభద్ర నది ఉన్నా రైతులకు మాత్రం సాగునీరు అందక తల్లడిలుతున్నారు. గతం లో కురిసిన కొద్దిపాటి వర్షానికి రైతులు మిరప, పత్తి పంటలు సాగు చేశారు. అప్పటి నుంచి వర్షం లేకపోవడంతో రైతులు పంటలు ఎండి పోతుండడం చూడలేక పంటలను ఎలా కాపాడుకోవాలని పడరాని పాట్లు పడుతున్నారు. తుంగభద్ర నదికి వరద లేకపోవడంతో రైతులు ఆర్డీఎస్ ద్వారా సాగునీరు అందుతాయన్న ఆశలు వదులుకున్నారు.
మరోవైపు కృష్ణానదిలో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ జారాల కుడి కాల్వ ద్వారా సాగునీరు వదలకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జూరాల లింక్ ద్వారా సాగునీరు అందితే కొద్ది పాటి పంటలైనా కాపాడుకునే అవకాశం ఉందని తలంచిన రైతులు ఆదివారం ఆర్డీఎస్ డిస్ట్రిబ్యూటరీ-30 జూ రాల లింక్ కాల్వలో రైతులు నిలబడి నిరసన వ్య క్తం చేశారు. జూరా ల లింక్ కాల్వ ద్వారా నీరు అందించి పంటలను కాపాడాలని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. జూరాల లింక్ కాల్వ ద్వారా సాగునీరు అందిచకుంటే పెద్ద ఎత్తు న ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

