కేసీఆర్‌కు ఘనస్వాగతం
తెలంగాణ తొలి సీఎం, యాదగిరిగుట్ట అభివృద్ధి ప్రదాత కేసీఆర్‌కు ఆలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం ఘన స్వాగతం లభించింది. మండలంలోని బాహుపేట స్టేజీ వద్ద ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత, టెస్కాబ్ మాజీ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 2 వేల మంది పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
- జై కేసీఆర్.. అంటూ మిన్నంటిన నినాదాలు
- ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత, టెస్కాబ్ మాజీ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో స్వాగతం
- పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ ముందుకెళ్లిన కేసీఆర్
యాదగిరిగుట్ట, ఆగసు ్ట9: తెలంగాణ తొలి సీఎం, యాదగిరిగుట్ట అభివృద్ధి ప్రదాత కేసీఆర్‌కు ఆలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం ఘన స్వాగతం లభించింది. మండలంలోని బాహుపేట స్టేజీ వద్ద ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత, టెస్కాబ్ మాజీ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 2 వేల మంది పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆదివారం కేసీఆర్ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎర్రవెల్లిలోని తన స్వగృహం నుంచి సుమారు 300 వాహనాలతో పలువురు మాజీ మంత్రులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులతో కలిసి బయలుదేరారు.
కేసీఆర్ బాహుపేట స్టేజీ సమీపంలోని ఇమ్మడి కాఫీ సెంటర్ వద్దకు రాగానే పార్టీ శ్రేణులు ‘జై కేసీఆర్’.. ‘జై బీఆర్ఎస్’, సీఎం.. సీఎం అంటూ చేసిన నినాదాలు మిన్నంటాయి. దీంతో కేసీఆర్ తన వాహనాన్ని సుమారు ఆరనిమిషం నిలిపి అక్కడ వేచి ఉన్న ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత, టెస్కాబ్ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డిని ఆపాయ్యంగా పలకరించారు. కారు డోరు తీసి బయటకు వద్దామనుకున్న ఆయనకు అక్కడ కిక్కిరిసిన యువకులతో బయటకు రాలేని పరిస్థితి నెలకొన్నది. గొంగిడి దంపతులు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటన్నర వరకు ఓపికతో కేసీఆర్ కోసం ఎదురు చూశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, తెలంగాణ జాతిపిత కేసీఆర్‌ను చూసేందుకు పార్టీ శ్రేణులతో పాటు వాహనాదారులు, ప్రయాణికులు, ఇతర పార్టీలకు చెందిన నాయకులు సైతం అక్కడికి చేరుకున్నారు.
కేసీఆర్ రెండు చేతులు జోడించి పార్టీ శ్రేణులకు అభివాదం చేసుకుంటూ వాహనంలో నర్సంపేటకు బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి కేసీఆర్‌కు వినతి పత్రం అందజేశారు. అక్కడే ఉన్న యువత సెల్పీలు దిగేందుకు పోటీ పడగా సునీతా రెడ్డి తలకు స్వల్ప గాయమైంది. కార్యక్రమంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నార్ముల్ మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్‌రెడ్డి, జడ్పీటీసీ పల్లా వెంకట్‌రెడ్డి, వివిధ మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు కర్రె వెంకటయ్య, సట్టు తిరుమలేశ్, గంగుల శ్రీనివాస్ యాదవ్, బొట్ల యాదయ్య, ఖలీల్, బీసు చందర్‌గౌడ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ ఇమ్మడి రామిరెడ్డి, సర్పంచులు కవిడే మహేందర్, గడ్డం దేవేందర్, యువజన విభాగం మండల ప్రధాన కార్యదర్శి బీమగాని నర్సింహగౌడ్, పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి, మున్సిపల్ మాజీ చైర్మన్ వస్పరి శంకర్, మాజీ ఎంపీటీసీ పలుగుల నవీన్, నాయకులు సతీశ్ యాదవ్, ఎగ్గిడి కృష్ణ, గొంగిడి రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దొంగల చేతివాటం
పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో రావడంతో దొంగలు చేతివాటాన్ని ప్రదర్శించారు. కేసీఆర్ వచ్చిన సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత నెలకొన్నది. జై కేసీఆర్.. అంటూ కార్యకర్తలు నినాదాలతో వాహనాన్ని చుట్టుముట్టారు. ఈ క్రమంలో ఇదే అదును భావించిన కొంతమంది దొంగలు టెస్కాబ్ మాజీ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి జేబులోని రూ. 30 వేలను దొంగిలించారు. ఆయనతోపాటు తాళ్లగూడెం వార్డు సభ్యుడు ప్రవీణ్ జేబు నుంచి రూ. 10వేలు, ఇతర నాయకుల నుంచి సైతం భారీ మొత్తంలో నగదును దొంగిలించినట్లు తెలిసింది.
‘వచ్చేయ్ అమ్మా’ అంటూ కేసీఆర్ పిలపు..
బాహుపేట స్టేజీ వద్దకు రాగానే కేసీఆర్ వాహనం వద్దకు చేరుకున్న ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి తన చేతిలో ఉన్న వినతి పత్రాన్ని కేసీఆర్‌కు అందజేశారు. ఈ క్రమంలో తన వాహనాన్ని ముందుకు పోనిస్తూ ‘వచ్చేయ్ అమ్మా’ అంటూ కేసీఆర్ చేతితో సైగ చేస్తూ పిలిచారు. దీంతో సునీతా మహేందర్‌రెడ్డి తన వాహనంపై కేసీఆర్‌తో కలిసి నర్సంపేటకు బయలుదేరి వెళ్లారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
Nani Movie | గ్యాంగ్‌స్టర్ మోడ్‌లోకి నాని.. సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ షూటింగ్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

