Intelligence failure | చిగురుమామిడి, మే 2: పహల్గాం దాడి బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం, నిఘా వ్యవస్థ వైఫల్యంతో అమాయక ప్రజలు బలి కొన్నారని సీపీఐ జాతీయ నేత చాడ వెంకట్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సీపీఐ కార్యాలయం మండల సభ శుక్రవారం నిర్వహించారు. చాడ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ మేడే కార్మికులను బీజేపీ వేధింపులకు గురి చేస్తుందన్నారు. వ్యతిరేక చట్టాలను తెచ్చి రైతులకు కేంద్రం క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
కార్మిక చట్టాలను కేంద్రం నిర్వీర్యం చేస్తుందని, మతోన్మాదానికి ప్రోత్సహిస్తున్న బీజేపీ 11 ఏళ్ల పాలనలో ప్రజలకు చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు. కార్పొరేట్ శక్తులకు బీజేపీ కొమ్ము కాస్తుందన్నారు. రాష్ట్రానికి రావాలసిన నిధులను ఇవ్వడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందన్నారు. విభజన హామీలను తుంగలో తొక్కి రాష్ట్రాల హక్కులను కాల రాస్తుందన్నారు. కమ్యూనిస్టులు మతోన్మాద బిజెపిని ఎండ కట్టేందుకు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.
స్వగ్రామంలో ఉండి పార్టీ బలోపేతం చేస్తా…. చాడ
కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడి మండలం రేకొండ స్వగ్రామంలో ఉండి పార్టీని కి పూర్వ వైభవం తీసుకువస్తానని సీపీఐ జాతీయ చాడ అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల కోసం పార్టీని మరింత బలోపితం చేస్తామన్నారు. అన్ని గ్రామాల్లో కమిటీలను ఏర్పాటు చేసి పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
బీజేపీకి ప్రధాన శత్రువులు కమ్యూనిస్టులే..: జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి
మతోన్మాదాన్ని పూజిస్తున్న ప్రోత్సహిస్తున్న బీజేపీకి కమ్యూనిస్టులు ప్రధాన శక్తులని సీపీఐ జిల్లా కార్యదర్శి వెంకటస్వామి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని సీపీఐతో పొద్దు ధర్మాన్ని పొత్తు ధర్మాన్ని పాటించడం లేదన్నారు. కర్రె గుట్టల వద్ద ప్రభుత్వం పోలీసులు మోహరించి కూబింగ్ చేయడం నిలిపివేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆదివాసుల హక్కులు, చట్టాలను, అటవీ హక్కుల సంపదను కేంద్రం హరిస్తుందన్నారు. ఆదివాసులను పిట్టలను కాల్చినట్లు కాలుస్తున్నారని ఆరోపించారు.
సామాన్య ప్రజలను కుబింగ్ పేరుతో దాడులు చేయడం ప్రభుత్వం నిర్ణయం సరైంది కాదన్నారు. వీటిపై కమ్యూనిస్టులు గలమెత్తి పోరాటాలు చేస్తారని అన్నారు. సీపీఐ లేకుండా కాంగ్రెస్ హుస్నాబాద్ నియోజకవర్గంలో గెలిచే పరిస్థితి లేదన్నారు. జిల్లాలో 147 శాఖలు ఉన్నాయని, ఈనెల 27, 28 తేదీలలో జిల్లా కేంద్రంలో జిల్లా మహాసభలను నిర్వహిస్తామన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పొన్నగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు అందే స్వామి, బోయిని అశోక్, గూడెం లక్ష్మి, కౌన్సిల్ సభ్యులు చాడ శ్రీధర్ రెడ్డి, బూడిద సదాశివ, మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, మండల నాయకులు తీరాల సత్యనారాయణ, కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి, కాంతాల శ్రీనివాస్ రెడ్డి, తమ్మిశెట్టి రవీందర్, మండల కొమురయ్య, బండోజు సదానందం,, జనార్దన్,రామ స్వామి, కొమురయ్య, అన్ని గ్రామాల కార్యదర్శులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.