sultanabad | సుల్తానాబాద్ రూరల్, ఏప్రిల్ 3: రాష్ట్ర కాంగ్రెస్ పరిపాలన వైఖరిపై బీజేపీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు కర్రే సంజీవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని బిజెపి కార్యాలయంలో గురువారం మున్సిపాలిటీ బిజెపి అధ్యక్షులు కూకట్ల నాగరాజు అధ్వర్యంలో గురువారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భముగా మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసపూరితమైన అనేక హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. నాలుగు వందల ఇరవై ఎకరాల యూనివర్సిటీ భూమిని అమ్ముకొని ప్రభుత్వాన్ని నడుపాలని చూస్తుందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోస పూరితమైన హామీలు ఇచ్చి ప్రజల చేత విమర్శలు ఎదుర్కొంటోందని విమర్శించారు.
పేద ప్రజలుకు ఇస్తున్న తెల్ల రేషన్ కార్డు సన్నబియ్యం కేంద్ర ప్రభుత్వమైన నరేంద్ర మోడీ ప్రభుత్వం కిలోకి రూ.40 చెల్లిస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తామే ఇస్తున్నట్లు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి అశోక్ రావు, జిల్లా కార్యదర్శి సౌదరి మహేందర్ యాదవ్, సీనియర్ నాయకులు నాగుల మల్యాల తిరుపతి, కోట నాగేశ్వర్, కామని రాజేంద్ర ప్రసాద్, ఉషణ అన్వేష్, మేండ శంకరయ్య, ఏళ్ళంకీ రాజు, ఎనగందుల సతీష్, కందునూరి కుమార్, పల్లె తిరుపతి, బుసరపు సంపత్, బుర్ర సతీష్ గౌడ్, దాసరి వెంకటేష్, కొల్లూరి సంతోష్, గుడ్ల వెంకటేష్, వల్స సాయి కిరణ్, శేకర్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.