MLA Dr. Sanjay Kumar | సారంగాపూర్, సెప్టెంబర్ 11: రాష్ట్రంలోనే అత్యధికంగా జగిత్యాల నియోజక వర్గానికి పల్లే దవాఖానలు మంజూరయ్యాయని, పల్లె దవాఖానాల ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. బీర్పూర్ మండలంలోని కొల్వాయి గ్రామంలో రూ.20లక్షలతో వ్యయంతో నిర్మించిన పల్లె దవాఖాన భవనాన్నిగురువారం ఎమ్మల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. గ్రామంలోని గౌడ సంఘ కార్యలయం వద్ద 72 మంది గీతకార్మికులకు వంద శాతం సబ్సిడితో కాటమయ్య కిట్టను పంపిణీ చేశారు.
మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 20 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూలైన రూ.5.80 లక్షలు విలువగల చెక్కులను అందజేశారు. పల్లెదవాఖానాలతో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుతాయన్నారు. గీత కార్మికులకు ఎల్లవేలలా అండగా ఉంటామని, మండలంలోని అన్ని కులసంఘాల అభివృద్ధికి నిధులు కేటాయించామన్నారు. మండలంలోని తుంగూర్ గ్రామంలో కస్తూరిభా ఏర్పాటు చేశామని శాశ్వత భవనం కూడా నిర్మాస్తామన్నారు.
మండలంలోని రోళ్లవాగు ప్రాజెక్ట్ అభివృద్ధికి కృషి చేస్తున్నానని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ అరవింద్‌ల సహకారంతో పూర్తి చేస్తామన్నారు. ప్రజల వెంటనే ఉంటు ప్రజల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తాన్నారు. అనంతరం మండలంలోని తాళ్ల ధర్మారం, కొల్వాయి గ్రామాల్లో బాదిత కుటుంబాలను పరామర్శించి ప్రగాడ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా వైద్యాధికారి ప్రమోద్, జిల్లా కిడీసీసీబీ డైరేక్టర్ ముప్పాల రాంచందర్ రావు, జిల్లా సంక్షేమ అధికారి సునిత, ఆయా శాఖల అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.