Sarangapur | సారంగాపూర్, జనవరి 8 : బీసీల సమగ్ర అభివృద్ధికి బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని కోరుతూ గురువారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వహిదొద్దిన్ కు వినతి పత్రం అందజేశారు. ఎస్సీ, ఎస్టీ, సబ్ ప్లాన్ తరహాలో వెనుకబడిన తరగతుల బీసీ సమగ్ర అభివృద్ధి కోసం చట్టబద్ధమైన బీసీ సబ్ ప్లాన్ ను అమలు చేయాలని నాయకులు పేర్కోన్నారు.
రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీ సామాజిక ఆర్థిక స్థితిగతులు మెరుగు పడాలంటే వారికి ప్రత్యేక బడ్జెట్, చట్టపరమైన రక్షణ అవసరమని ఎస్సీ, ఎస్టీలకు అమలు అవుతున్న సబ్ ప్లాన్ తరహలోనే బీసీల కోసం కుడ ప్రత్యేక సబ్ ప్లాన్ తక్షణమే ఏర్పాటు చేయాలని డిమ్లా చేస్తున్న తమ డిమాండ్లను వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సాయి పపన్న, యూత్ అధ్యక్షులు గుండ్ల తిరుపతి, మండల అధ్యక్షులు గుండ్ల ప్రకాష్, ప్రదాన కార్యదర్శి గోగుల వెంకటేష్, యూత్ అధ్యక్షులు ఇడగొట్టు భీమయ్య, ప్రధాన కార్యదర్శి మల్లేష్ యాదవ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.