BC bandh | పెగడపల్లి: పెగడపల్లి మండలంలో శనివారం నిర్వహించిన బీసీల బంద్ విజయవంతమైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించలని డిమాండ్ చేస్తూ, చీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ పార్టీలతో పాటు, బీసీ సంఘాల నాయకులు స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వద్ద కొద్ది సేపు కలిసి, అవంతరం వేరు వేరుగా నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు ఉద్యమం గదని స్పష్టం చేశారు. బంద్ సందర్భంగా వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు స్వచ్చందగా మూసి వేశారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు, బీసీ సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.