తెలంగాణచౌక్, అక్టోబర్ 17 : బతుకమ్మ, దసరా పండుగలకు ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ 31.50 కోట్ల ఆదాయం వచ్చింది. పండుగల సందర్భంగా అధికారులు ఈ నెల ఒకటి నుంచి 12వ తేదీ వరకు, 14 నుంచి 17వ తేదీ వరకు ప్రత్యేకంగా బస్సులను నడిపించారు. 16 రోజుల్లో 11 డిపోల పరిధిలో 980 బస్సులు తిరుగగా, 61 లక్షల 11వేల 849 మంది ప్రయాణించారు. అందులో 42 లక్షల 34 వేల 544 మంది మహాలక్ష్మీ డిపోల వారీగా ఆదాయం చూస్తే గోదావరిఖనికి 5.27 కోట్లు, హుస్నాబాద్‌కు 1.43 కోట్లు, హుజూరాబాద్‌కు 2.11 కోట్లు, జగిత్యాలకు 4.22 కోట్లు, కరీంనగర్-1కు 3.38 కోట్లు, కరీంనగర్-2కు 4.23 కోట్లు, కోరుట్ల 2.26 కోట్లు, మంథని 1.84 కోట్లు, మెట్పల్లి 2.14 కోట్లు, సిరిసిల్ల 2.27 కోట్లు, వేములవాడ 2.33 కోట్ల ఆదాయం వచ్చినట్టు ఆర్ఎం సుచరిత తెలిపారు. రోజుకు 4 లక్షల మంది ప్రయాణికులు వివిధ గమ్య స్థానాలకు ప్రయాణం కొనసాగించారని, రద్దీకి అనుగుణంగా బస్సులను నడిపించామని చెప్పారు. సహకరించిన సిబ్బంది, డ్రైవర్లు, కండక్టర్లకు అభినందనలు తెలిపారు.