Telangana Cultural Society Singapore | కమానౌచౌరస్తా, సెప్టెంబర్ 29: తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు సంబవాంగ్ పార్క్ అట్టహాసంగా నిర్వహించారు. ప్రత్యేక బతుకమ్మ సాంప్రదాయ పాటలతో చిన్నాపెద్ద తేడా లేకుండా అందరు ఆటపాటలతో ఎంతో హుషారుగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ అంతర్జాతీయ శ్రీ కృష్ణ మందిరం (ఇస్కాన్) సింగపూర్, వైఎస్వీఎస్ఆర్ కృష్ణ (పాస్స్పోర్ట్ అటాచ్, ఇండియన్ హై కమిషన్, సింగపూర్), టీసీఎస్ఎస్ సొసైటీ అధ్యక్షుడు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, ఉపాధ్యక్షుడు జూలూరి సంతోష్ కుమార్, కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించగా, సంబరాల్లో సింగపూర్ స్థానికులతో పాటు ఎంతో మంది అతిథులు, ఎన్నారైలు సుమారు 2500 నుంచి 3000 వరకు పాల్గొని బతుకమ్మ ఆడారు.
ఇక్కడ సొసైటీ అధ్యక్షుడు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల, కోశాధికారి నంగునూరి వెంకట రమణ, సొసైటీ ఉపాధ్యక్షుడు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్, సంతోష్ వర్మ మాదారపు, కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.