Best service award | పాలకుర్తి : పాలకుర్తి మండలం బసంత్ నగర్ ఎస్సై ఆర్ స్వామికి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాగూర్ చేతిలో మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అవార్డును శుక్రవారం అందజేశారు. గత కొంతకాలంగా బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రత పరిరక్షణతో పాటు ఇటీవల ఈసాల త క్కల్లపల్లి గ్రామంలో వరుస దొంగతనాలు చేస్తున్న దొంగను చాక చక్యంగా పట్టుకోవడంలో ఎస్సై చూపెట్టిన చొరవను గుర్తించి ఈ బహుమతి అందించారు.
అంతేకాకుండా బసంత నగర్ ఎస్సై స్వామి ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలో ఈవ్ టీజింగ్, సైబర్ నేరానికి వ్యతిరేకంగా డ్రాగ్స్, గంజాయికి వ్యతిరేకంగా అనేక అవగాహన ర్యాలీలు సమావేశాలు చేపట్టారు. మండలంలో శాంతి భద్రతల పర్యవేక్షణ పట్ల ప్రత్యేక చొరవ చూపించినందుకు సేవా పురస్కారాన్ని అందించడం పట్ల బసంత్‌నగర్ ఎస్సై ఆర్ స్వామి సంతోషం వ్యక్తం చేశారు.