కార్పొరేషన్, జనవరి 30: ‘రాష్ట్రంలో 24 గం టల కరెంట్ వస్తే రాజీనామా చేస్తానన్న బండి సంజయ్.. ఏ ఊరికి వస్తావో చెప్పాలి. వస్తే ని రూపించేదుకు మేం సిద్ధం’ అని బీఆర్ఎస్ జి ల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు సవాల్ విసిరారు. సోమవారం తారక హోటల్లో విలేకరులతో మాట్లాడారు. ఉచిత కరెంట్ వస్తుందో లేదో తెలుసుకోవాలనుకుంటే మీరు ఎంచుకున్న ఊరికెళ్లి కరెంట్ తీగలను ముట్టుకోండి.. అని ఎద్దేవా చేశారు. లేదంటే రా జీనామా చేయాలని డిమాండ్ చేశారు.
గ్రామీణ ప్రాంతాలకు మిషన్ భగీరథ కింద మంచినీటి సరఫరా చేస్తున్న విషయాన్ని కేంద్రమే గుర్తించి అవార్డు అందించిన విషయం బండి తెలుసుకోవాలని సూచించారు. విద్యుత్ డిస్కం ల విషయాన్ని రాష్ట్ర సర్కారు చూసుకుంటుం దన్నారు. ఎంతసేపు ఈ డిస్కంలను ఆదానీ, అంబానీలకు కట్టబెట్టి డబ్బులు సంపాదించాలని ఆలోచనతో ఉన్నారని విమర్శించారు. డి స్కంల గురించి మాట్లాడే అర్హత బండి సంజయ్‌కు లేదన్నారు. గ్యాస్‌పై, చేనేత రంగాలపై జీఎస్టీ పెంచే మీరు రాష్ట్రంలో విద్యుత్ చార్జీల గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు.
గల్ఫ్‌లో ఉన్న వ్యక్తులను తీసుకువచ్చే బాధ్యత కేంద్రానికి ఉం టదనే విషయంపై కూడా సంజయ్‌కు అవగాహన లేకపోవడం శోచనీయమ న్నారు. మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనలు చేసి 25 వేల కోట్ల పెట్టుబడులను రాష్ర్టానికి తీసుకువచ్చారని, మరీ సంజయ్ నియోజకవర్గానికి ఎన్ని నిధులు తెచ్చాడో చెప్పాలని నిలదీశారు. మోదీ మనసులో దేశాన్ని నాశనం చేయడమే తప్ప అభివృద్ధ్ది చేయాలన్న ఆలోచన లేదని విమర్శించారు. ఇప్పటికైనా సంజయ్ విమర్శలు మాని అభివృద్ధికి సహకరించాలని హితవు చెప్పారు. కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, బీఆర్ఎస్ నగరాధ్యక్షుడు చల్ల హరిశంకర్, నా యకులు శ్రీనివాస్‌గౌడ్, రాజేందర్రావు, కుల్దీప్, ప్రశాంత్, ఉదారపు మారుతి ఉన్నారు.