Mallapur | మల్లాపూర్, జూన్ 23: మండల కేంద్రంలోని స్థానిక ఆదర్శ పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్పల్లి సీఐ అనిల్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు చెడు వ్యాసనాల బారిన పడకుండ తగిన జాగ్రత్తలను తీసుకోవాలన్నారు.
అలాగే యువత ఎక్కువగా డ్రగ్స్ బారి పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. ఇక్కడ ఎస్ఐ రాజు, ప్రిన్సిపాల్ భూమేశ్వర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.