Chigurumamidi | చిగురుమామిడి, మే 4 : పంటల మార్పిడీ, సేంద్రియ సాగు విధానాలపై మండలంలోని ముల్కనూర్ గ్రామపంచాయతీ ఆవరణలో జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో రైతులకు వివిధ పంటల సాగు పద్ధతులు, నేల ఆరోగ్యం, సేంద్రియ ఎరువుల వినియోగం పలు అంశాలపై సోమవారం వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ మదన్మోహన్ రెడ్డి అవగాహన నిర్వహించారు. రైతులు నిరంతరం ఒకే పంట వేయడం వల్ల భూమిలో భూసారం పోషకాలు తగ్గిపోతాయని, పంట మార్పిడీ ద్వారా లోటును భర్తీ చేయవచ్చన్నారు.
పంట ఎంపికలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలని, సంబంధిత ఏఈఓల సూచనలు పాటించాలన్నారు. రైతులు రసాయనిక ఎరువులు, యూరియా వాడకాన్ని తగ్గించి సేంద్రియ పద్ధతిలో పంటలను పండించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, సర్పంచ్ సాంబారి భారతమ్మ కొమురయ్య, మండల వ్యవసాయ అధికారి పున్నం చందర్, ఉపసర్పంచ్ వెంకటేష్ గౌడ్, విత్తన ధ్రువీకరణ అధికారి నవీన్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి ప్రణయ్,