Nandimedaram | ధర్మారం, ఫిబ్రవరి13: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నంది మేడారం తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల విద్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మట్టి నమూనా సేకరణ పై విద్యార్థులకు శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్కూల్ సాయిల్ పథకం కార్యక్రమంలో భాగంగా ఏఈఓ వినీత్ 7,8,9 తరగతుల తరగతులు విద్యార్థులకు మట్టి నమూనా సేకరణ పై శిక్షణ ఇచ్చారు.
మట్టి పరీక్షల అనంతరం పంటల సాగుతో కలిగే ప్రయోజనాలను ఆయన వివరించారు .మట్టి పరీక్షలు నిర్వహించిన అనంతరం మట్టిలో ఉన్న పోషకాల ను అనుసరించి పంటలు సాగు చేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు. ముఖ్యంగా సేంద్రియ ఎరువుల వినియోగంతో సాగుచేసిన పంటలు అధిక దిగుబడి వస్తాయని ఏఈఓ పేర్కొన్నారు. నేల సంరక్షణ పై విద్యార్థి స్థాయి నుంచి అవగాహన కలిగి ఉంటే నాణ్యమైన పంటలు పండిస్తే ప్రజలు ఆరోగ్యకరంగా ఉంటారని ఏఈఓ విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ విజయ, సైన్స్ టీచర్ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.