సిటీబ్యూరో: నగరంలో ట్రాఫిక్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. చిన్నపాటి వర్షానికే రహదారులపై వరద పోటెత్తుతుండటంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే గంటల తరబడి స్తంభించిపోతున్నది. చిన్నపాటి దూరానికి కూడా వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. చినుకుపడితే చాలు.. నగరవాసులు వణికిపోతున్నారు.
48 గంటల్లో భారీ వర్షాలు

సిటీబ్యూరో: నగరంలో గురువారం పలుచోట్ల మోస్తరు వాన కురిసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతంలో 1.85 సెం.మీలు, ఉప్పల్, నాచారంలో 1.33 సెం.మీల వర్షపాతం నమోదైంది. రాగల మరో 48గంటల్లో మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.